భయపడుతున్న అభిమానులు జూనియర్ లుక్ చూసి
- March 25, 2017
జూనియర్ ఎన్టీఆర్ లేటెస్ట్ గా నటిస్తున్న 'జై లవకుశ' సినిమాలో నెగిటివ్ పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. జూనియర్ తన కెరియర్ లో మొట్టమొదటి సారి త్రిపాత్రభినయం చేస్తున్న ఈమూవీలో తన మూడు పాత్రలకు సంబంధించి మూడు డిఫరెంట్ లుక్స్ లో కనిపించ బోతున్నాడు. అయితే ఈసినిమాకు సంబంధించి జూనియర్ అత్యం త భయంకరంగా కనిపిస్తున్న లుక్ కు సంబంధించిన ఫోటో లీక్ అయింది.
ప్రస్తుతం ఈఫోటో మీడియాకు హాట్ టాపిక్ గా మారింది. బాబీ దర్శకత్వం వహిస్తున్న ఈమూవీకి సంబంధించి జూనియర్ గెటప్ లో ఇలా భయపెట్టే కళ్లు, గుండు చేసిన లుక్ తో 'జై' కేరక్టర్లో కనిపించనున్నాడన్న వార్తలు వస్తున్నాయి. అయితే ఇది ఎన్టీఆర్ వేసుకున్న మేకప్ కాదు జస్ట్ ఒక మాస్క్ మాత్రమే అని తెలుస్తోంది.
ఇటువంటి మేకప్ వేసుకుంటే జూనియర్ ఎలా కనిపిస్తాడు అని తెలుసు కోవడానికి ఇలాంటి ఒక మాస్క్ తయారుచేసి జూనియర్ ముఖానికి తొడిగి ఒక టెస్ట్ ట్రయల్ చేసినట్లు తెలుస్తోంది. ఈ మూవీకి పనిచేస్తున్న హాలీవుడ్ టెక్నీషియన్ వాన్స్ గార్ట్ వెల్ రూపొందించిన మాస్క్ ఇది అని అంటున్నారు. లార్డ్ ఆఫ్ ద రింగ్స్ కు వర్క్ చేసి ఎంతో పేరును తెచ్చుకున్న హాలీవుడ్ టెక్నీషియన్ వాన్స్ గార్ట్ వెల్ జూనియర్ మూవీకి పనిచేయడం ఇప్పుడు టాపిక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారింది.
ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీలో జరుగుతున్న ఈ సినిమా షూటింగ్ లో జూనియర్ కు ఈ మాస్క్ వేసి ఒక టెస్ట్ ట్రయల్ చేసినట్లు టాక్. జూనియర్ అభిమానులు మానసికంగా ఈ లుక్ కు అలవాటు పడే విధంగా ఈ లుక్ కు సంబంధించిన ఫోటోలు లీక్ చేసినట్లు సమాచారం.
భయకరంగా కనిపిస్తూ కళ్ళు రెండు తెరిచి ఉన్న ఈలుక్ ఫోటో ఇప్పుడు జూనియర్ అభిమానులను విపరీతంగా ఆకర్షిస్తోంది. దసరా ను టార్గెట్ చేస్తూ విడుదల కాబోతున్న ఈ మూవీ పై ఎన్నో ఆసలు పెట్టుకున్న జూనియర్ ఈసినిమా కోసం తెగ శ్రమ పడుతున్నాడు.
తాజా వార్తలు
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!







