లేటెస్ట్ టెక్నాలజీ, బాహుబలి 2 ఫంక్షన్ కోసం
- March 25, 2017
ఈరోజు సాయంత్రం జరగబోతున్న 'బాహుబలి 2' ప్రీ రిలీజ్ ఫంక్షన్ కోసం అత్యంత భారీ స్థాయిలో చేసిన ఏర్పాట్లకు సంబంధించిన వార్తలు బయటకు వస్తున్నాయి. రామోజీ ఫిలింసిటీలో ఏర్పాటు చేసిన ఈ ఈవెంట్ ను ప్రత్యక్షంగా చూడటానికి సుమారు 10 వేల పాసులు ప్రభాస్ అభిమానులకు ఇప్పటికే పంపిణీ చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి.
తెలుస్తున్న సమాచారం మేరకు ఈ పాసుల సంఖ్య ఏ మాత్రం సరిపోవక పోవడంతో మరికొన్ని అదనపు పాసులు కూడ ఈరోజు ఉదయం నుండి ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. ఈ ఈవెంట్ హైదరాబాద్ లో జరుగుతూ ఉన్నా భీమవరం ప్రాంతానికి చెందిన ప్రభాస్ అభిమానులు ఇప్పటికే వేల సంఖ్యలో హైదరాబాద్ చేరుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.
అయితే దీనికితోడు ఇప్పటి వరకు ఏ సినిమా ఆడియో ఫంక్షన్ కు ఉపయోగించని విధంగా 'బాహుబలి 2' ప్రీ రిలీజ్ ఫంక్షన్ కోసం ఉపయోగిస్తున్న లేటెస్ట్ టెక్నాలజీ ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీకి హాట్ టాపిక్ గా మారింది. ఈ ఈవెంట్ ను యూట్యూబ్ లో లైవ్ టెలికాస్ట్ చూసేవారు 360 డిగ్రీల దగ్గరలో చూస్తున్నట్లు ఫీలింగ్ కలుగుతుందని తెలుస్తోంది.
దీనికోసం రెడియన్ లూమ్ టెక్నాలజీకి సంబంధించిన 360సిసి కెమెరాలను ప్రత్యేకంగా తెప్పించి ఈ లైవ్ టెలికాస్ట్ కోసం వాడుతున్న నేపధ్యంలో స్మార్ట్ ఫాన్స్ లో ఈ ఈవెంట్ ను చూసేవారికి ఈ ఈవెంట్ దూరంలో జరుగుతూ ఉన్నా ఈ ఫంక్షన్ వేదికకు అతి దగ్గరలో కూర్చుని చూస్తున్న ఫీలింగ్ కలుగుతుంది అని అంటున్నారు. అమెరిక అధ్యక్షుడు ట్రంప్ ప్రమాణస్వీకారం లైవ్ టెలికాస్ట్ చూసేందుకు ఈ టెక్నాలజీ ఈమధ్య వాడినట్లు తెలుస్తోంది.
మన తెలుగు రాష్ట్రాలలోని ప్రముఖ న్యూస్ చానల్స్ అన్నీ ఈ కార్యక్రమాన్ని ఈ సాయంత్రం 6 గంటల నుండి లైవ్ టెలికాస్ట్ చేయబోతున్నారు. 'బాహుబలి 2' కు ఏర్పడిన విపరీతమైన మ్యానియా రీత్యా ఈ లైవ్ టెలికాస్ట్ కార్యక్రమానికి ఇప్పటి వరకు టెలివిజన్ ఇండస్ట్రీలో ఎవరూ ఎప్పుడూ చూడని రేటింగ్స్ రికార్డ్ అవుతాయి అన్న అంచనాలు వినిపిస్తున్నాయి. ఏమైనా ఈరోజుతో 'బాహుబలి 2' మ్యానియాకు కౌంట్ డౌన్ కు మొదలైంది.
తాజా వార్తలు
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!
- గుల్మార్గ్లో ఎంపీ బాలశౌరి నేతృత్వంలో కమిటీ సమావేశం
- యూఏఈలో హత్య కేసుల్లో కిసాస్ మినహాయింపు పై కొత్త శిక్షలు..
- అమెజాన్‌లో రికార్డు స్థాయి అమ్మకాలు..







