నా భర్తకు ప్రాణభిక్ష పెట్టండి
- March 27, 2017
దుబాయి లో ఉరిశిక్ష పడ్డ తన భర్త కు ప్రాణబిక్ష పెట్టాలని ఓ మహిళా వేడుకుంది నిజామాబాదు జిల్లా,బాల్కొండ మండలం ,మెండోరా కు చెందిన తన భర్త మాకూరి శంకర్ 2005 లో ఉపాధి కోసం దుబాయ్ వెళ్లి అక్కడ ఓ చిన్న సంస్థ లో ఫోర్ మెన్ గా పని చేసేవాడని తెలిపింది. 2009లో అతని తో పాటు పనిచేస్తున్న రాజస్థాన్ కు చెందిన రామావతార్ కుమావత్ ప్రమాదవశాత్తు భవనం పై నుంచి కింద పడి మృతి చెందటంతో ఫోర్ మెన్ గా ఉన్న శంకర్ పై హత్యా నేరం మోపి దుబాయిలో పుజిరా జైలులో బంధించినట్లు తెలిపింది .అప్పటినుంచి అతడు జైలులోనే ఉన్నాడని , ప్రస్తుతం అక్కడి కోర్టు శంకర్ కు ఉరిశిక్ష విధించిందని ఆమె తెలిపింది హత్యకు గురైన వ్యక్తుల కుటుంబ సభ్యులు క్షమాబిక్ష లేఖను సమర్పిస్తే శంకర్ ను విడుదల చేస్తారని తెలిపింది .అర్మూర్ కు చెందిన సామజిక వేత్త దేగాం యదా గౌడ్ రాజస్థాన్ వెళ్లి అక్కడి ప్రముఖులు పెద్దలతో కలిసి, కుమావత్ కుటుంబసభ్యులను కలవగా వారు క్షమాబిక్ష లేక ఇచ్చేందుకు సిద్ధమయ్యారని ,అయితే తాము ఇంటిలో పెద్ద దిక్కు కోల్పోయి పేదరికం లో ఉన్నామని,అందుకు రూ. 6. లక్షలు ఇవ్వాలని కోరుతున్నారని తెలిపింది. దాతలు ప్రభుత్వము జోక్యం చేసుకొని తన భర్తను విడిపించాలని వేడుకుంది ఆర్థిక సహాయం అందించే వారు 9848248894,9908600534 నెంబరు లోగాని తెలంగాణ గ్రామీణ బ్యాంక్ పేరుతో ఉన్న అకౌంట్ నెంబర్ 79039814635 ifcsc కోడ్ :BHYORRDCGB కి పంపాలని కోరారు.తాను వ్యవసాయ కూలీగా పని చేస్తూ కొడుకును పోషించుకుంటున్నానని,తాను ఆరు నెలల గర్భవతి గా ఉన్నప్పుడు తన భర్త శంకర్ దుబాయ్ వెళ్లాడని , ఆతర్వాత నెలరోజులకు పోనే చేసినట్లు తెలిపింది. ఆయన తప్పు ఏమిలేకున్నా జైలులో పెట్టారని , ఇంతవరకు కొడుకును చేసుకోలేదని విలపించింది .ప్రభుత్వం తన భర్తను విడిపించేందుకు కు కృషి చేయాలనీ వేడుకుంది.
-సాయికృష్ణ యాదవ్.
తాజా వార్తలు
- విజయవాడలో గాంధీ శిల్ప బజార్ ప్రారంభం
- శ్రీనగర్ చేరుకున్న ఎంపీ బాలశౌరి..
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్లో కొత్త సీజన్ ప్రారంభం.. 20 కోట్ల పూలతో కనువిందు!
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!
- కువైట్‌లో బుక్ డొనేషన్ డ్రైవ్..!!
- యూఏఈలో ఆత్మహత్యాయత్నం ఇక నేరం కాదు..!!
- ఒమన్‌లో వరుస చోరీలు.. ఏడుగురు నిందితులు అరెస్ట్..!!
- దుబాయ్‌లో షేరింగ్ వసతికి అనుమతించిన ప్రాంతాల పూర్తి జాబితా..







