నర్సు హత్య కేసులో నిందితుడైన భర్తను భారతదేశంకు పంపివేత
- March 27, 2017
మస్కట్:గత ఏడాది జరిగిన ఓ భారతీయ నర్సు హత్య కేసులో అనుమానితుడైన ఆమె భర్తకు ఎట్టకేలకు గల్ఫ్ చెర కొన్నాళ్ళు తప్పింది. కేరళాకు చెందిన లిన్సన్ థామస్ తన భార్య నర్సు చిక్కు రాబర్ట్ మరణించిన 341 రోజుల అనంతరం భారతదేశంకు సోమవారం వేకువజామున ప్రయాణమయ్యారని కంపెనీ అధికారి ఒకరు తెలిపారు. శలాలహ్ లోని భద్ర అల్ సమా హాస్పిటల్ లో నర్సుగా పని చేస్తున్న చిక్కు రాబర్ట్ హత్య కేసులో ఆమె భర్త లిన్సన్ కు ప్రమేయం ఉండొచ్చని అనుమానంతో గత 119 రోజులుగా పోలీసు కస్టడీలో ఉంటున్నారు. ఈ కేసు గూర్చి మరిన్ని పరిశోధనలలో భాగంగా ఒమన్ పోలీసు కస్టడీ నుంచి లిన్సన్ కొన్నాళ్ళు పాటు విడుదలయ్యారు. గత ఏడాది స్థానికంగా ఎంతో సంచలనం కల్గించిన భారతీయ నర్సు హత్య నేటికీ మిస్టరీగానే ఉంది. ఏప్రిల్ 20 వ తేదీ 2016 లో శలాలహ్ లో వారు నివాసముంటున్న అపార్ట్మెంట్ లో రాత్రి 10 గంటల సమయంలో చిక్కు రాబర్ట్ దారుణ హత్యకు గురై చనిపోయింది. పోస్టుమార్టంలో ఆమె గర్భవతి అని తేలింది. గత ఏడాది కాలంగా ఈ కేసు విచారణ ఎంతో పకడ్బందీగా జరుగుతుంది. కాగా నేడు భారతదేశం వెళుతున్న లిన్సన్ విమానాశ్రయంలో "మా గల్ఫ్ డాట్ కామ్" ప్రతినిధితో మాట్లాడుతూ,తనను భారతదేశం వెళ్ళడానికి అనుమతించిన ఒమాన్ పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు. నాకు న్యాయవ్యవస్థ పై పూర్తి విశ్వాసం ఉంది. తన భార్యను హత్య చేసిన హంతకుడిని ఖచ్చితంగా న్యాయాధికారులు కనుగొంటారని నమ్మకం ఉందన్నారు. నేను భారతదేశం వెళ్ళడానికి అనుమతించిన వారికి నా ప్రత్యేక ధన్యవాదాలు. నేను త్వరలో తిరిగి ఇక్కడకు వస్తానని లిన్సన్ చెప్పారు.
తాజా వార్తలు
- అయోవాలో దిగ్విజయంగా NATS క్రికెట్ టోర్నమెంట్
- జెవర్ ఎయిర్పోర్ట్కు ‘నరేంద్ర మోడీ’ పేరు.. క్యాబినెట్ ఆమోదం
- చార్లెట్ లో వైభవంగా NATS తెలుగు సంబరాలు
- సౌదీ అరేబియాలోని తమ పౌరులు అప్రమత్తంగా ఉండాలని భారత్ సూచన
- విజయవాడలో గాంధీ శిల్ప బజార్ ప్రారంభం
- శ్రీనగర్ చేరుకున్న ఎంపీ బాలశౌరి..
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్లో కొత్త సీజన్ ప్రారంభం.. 20 కోట్ల పూలతో కనువిందు!
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!







