చనిపోయిన వ్యక్తికి గ్రీటింగ్స్ ఏంటి?
- March 27, 2017
మినిస్ట్రీ ఆఫ్ ఎక్సటర్నల్ ఎఫైర్స్, కొన్ని విషయాల్లో ప్రతిసారీ విమర్శలు ఎదుర్కోవడం శోచనీయంగా ఉంది. రియాద్‌లో మార్చ్ 9వ తేదీన నక్కా గంగాధర్ అనే వ్యక్తి మృతి చెందారు. ఆ విషయాన్ని బంధువులకు తెలియజేసే క్రమంలో 'డియర్ నక్కా గంగాధర్' అని పేర్కొనడం పట్ల బాధిత కుటుంబాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. విషయాన్ని తెలియజేసే క్రమంలో, 'గ్రీటింగ్స్' అని పేర్కొంటూ మృతుడికే పంపుతున్నట్లుగా లెటర్ పంపడాన్ని బాధిత కుటుంబం ఆక్షేపణ తెలిపింది. తెలంగాణలోని జగిత్యాలలోగల మెట్‌పల్లికి చెందిన వ్యక్తి నక్కా గంగాధర్. కోలిషన్ ఆఫ్ ఓవర్సీస్ తెలంగాణ అసోసియేషన్ ప్రెసిడెంట్ భీమ్‌రెడ్డి ఈ విషయంపై మాట్లాడుతూ, మరణించిన వారి పట్ల ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించడం దారుణమనీ కంప్యూటర్ జనరేటెడ్ స్లిప్స్ కావడంతో పొరపాట్లు దొర్లుతున్నా, వాటిని సరిదిద్దవలసి ఉందని అన్నారు. చనిపోయిన వ్యక్తుల ఇ-మెయిల్‌కి వారి మరణానికి సంబంధించిన వివరాలు ఎంతవరకు సబబు అని ఆయన ప్రశ్నించారు.
తాజా వార్తలు
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!
- కువైట్‌లో బుక్ డొనేషన్ డ్రైవ్..!!
- యూఏఈలో ఆత్మహత్యాయత్నం ఇక నేరం కాదు..!!
- ఒమన్‌లో వరుస చోరీలు.. ఏడుగురు నిందితులు అరెస్ట్..!!
- దుబాయ్‌లో షేరింగ్ వసతికి అనుమతించిన ప్రాంతాల పూర్తి జాబితా..
- ఖతార్‌లో డ్రైవింగ్ స్కూళ్లకు కొత్త నిబంధనలు..!!
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం







