3వ వారంలో విజయవంతంగా ప్రదర్శింపబడుతున్న `16`
- March 27, 2017
నేటి రోజుల్లో సినిమా వారం ఆడితే గొప్ప. రెండో వారంలో ప్రవేశిస్తే బ్లాక్‌బస్టర్. మూడోవారంలోకి వెళితే సిల్వర్‌జూబ్లీ కిందే లెక్క. కంటెంట్ లేకపోతే అంత సీనే ఉండదు. పెద్ద హీరో, చిన్న హీరో, స్ట్రెయిట్ సినిమా, డబ్బింగ్ సినిమా అన్న తేడా జనాలు చూడడం లేదు. ఇలాంటి ఛేంజోవర్ టైమ్‌లో వచ్చి సెన్సేషన్ సృష్టిస్తోంది `16- ఎవ్వెరి డీటెయిల్ కౌంట్స్`. శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఫిలింస్ బ్యానర్ నుంచి వచ్చిన సక్సెస్‌ఫుల్ సినిమా ఇది. తమిళ వెర్షన్‌ని మించి తెలుగులో పెద్ద సక్సెసైందీ చిత్రం. మూడోవారంలోనూ మెజారిటీ థియేటర్లలో పెద్ద సినిమాలతో పోటీపడి వసూళ్లు సాధిస్తుండడం సెన్సేషన్ అయ్యింది.
ఈ సందర్భంగా నిర్మాత చదవలవాడ పద్మావతి మాట్లాడుతూ -``16 మూవీ రిలీజ్ రోజు నుంచి విమర్శకుల ప్రశంసలు అందుకుని మంచి టాక్‌తో నడుస్తోంది. తమిళ వెర్షన్‌ని మించి అసాధారణ విజయం సాధించింది. ఇప్పటికి మూడోవారంలో అడుగుపెట్టి చక్కని వసూళ్లతో దూసుకెళుతోంది. ఇటీవల రిలీజైన పెద్ద సినిమాలతోనూ పోటీపడి రేసులో దూసుకెళుతోంది. ఎక్కువ థియేటర్లలో విజయవంతంగా రన్ అవుతుండడం సంతోషాన్నిస్తోంది. డెబ్యూ హీరో కార్తీక్ నరేన్, రెహ్మాన్ ప్రాధానపాత్రల్లో నటించారు. తెలుగులో క్రిటిక్స్ ప్రశంసలు పొందిన అరుదైన చిత్రమిది. ప్రేక్షకులకు అద్భుతమైన థ్రిల్నిచ్చింది కాబట్టే ఇంత పెద్ద సక్సెస్ సాధ్యమైంది`` అన్నారు.
తాజా వార్తలు
- దుబాయ్‌లో తక్కువ అద్దె ఇళ్లపై ప్రవాసుల ఆశలు.. కొత్త నిబంధనలతో ఊరట..!!
- అయోవాలో దిగ్విజయంగా NATS క్రికెట్ టోర్నమెంట్
- జెవర్ ఎయిర్‌పోర్ట్‌కు ‘నరేంద్ర మోడీ’ పేరు.. క్యాబినెట్ ఆమోదం
- చార్లెట్ లో వైభవంగా NATS తెలుగు సంబరాలు
- సౌదీ అరేబియాలోని తమ పౌరులు అప్రమత్తంగా ఉండాలని భారత్ సూచన
- విజయవాడలో గాంధీ శిల్ప బజార్ ప్రారంభం
- శ్రీనగర్ చేరుకున్న ఎంపీ బాలశౌరి..
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్లో కొత్త సీజన్ ప్రారంభం.. 20 కోట్ల పూలతో కనువిందు!
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!







