హైదరాబాద్ లో 'ఐఫా' కర్టెన్‌రైజర్
- March 27, 2017
ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ (ఐఫా) అవార్డుల వేడుక ఈనెల 28,29 తేదీల్లో హైదరాబాద్‌లో జరగనుంది. దక్షిణాది సినీపరిశ్రమకు సంబంధించి పురస్కారాలను ఈ వేడుకలో ప్రదానం చేయనున్నారు. ఈ సందర్భంగా సోమవారం పార్క్‌హయత్ హోటల్లో కర్టెన్‌రైజర్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సినీతారలు నాని, రానా, రాయ్‌లక్ష్మీ, ప్రగ్యాజైశ్వాల్, అక్షరహాసన్,శాన్వి తదితరులు హాజరయ్యారు. ఐఫా వేడుకకు టాలీవుడ్ నుంచి నాని, రానా వ్యాఖాతలుగా వ్యవహరించనున్నారు. ఈ సందర్భంగా నాని మాట్లాడుతూ.. ఈ కార్యక్రమాన్ని ఓ కళాశాల వేడుకలా నిర్వహించనున్నామని, రానాతో కలిసి నవ్వుతూ అందర్నీ నవ్విస్తామన్నారు.
తొలిసారి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తుండటంతో ఆనందంగా ఉందని నాని చెప్పుకొచ్చారు.


తాజా వార్తలు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!
- ఖతార్‌లో MotoGP, ఫార్ములా-1 గ్రాండ్‌ప్రి.. వాలంటీర్ల నమోదు ప్రారంభం..!!
- దుబాయ్‌లో తక్కువ అద్దె ఇళ్లపై ప్రవాసుల ఆశలు.. కొత్త నిబంధనలతో ఊరట..!!
- అయోవాలో దిగ్విజయంగా NATS క్రికెట్ టోర్నమెంట్
- జెవర్ ఎయిర్‌పోర్ట్‌కు ‘నరేంద్ర మోడీ’ పేరు.. క్యాబినెట్ ఆమోదం
- చార్లెట్ లో వైభవంగా NATS తెలుగు సంబరాలు







