'గల్ఫ్' మూవీ ఓవర్సీస్ అంబాసిడర్స్
- March 27, 2017
పొట్ట చేతబట్టుకుని గల్ఫ్ కి వెళ్తున్న వారి స్థితిగతులు ఎలా ఉన్నాయి? కన్నవారికి, కట్టుకున్నవాళ్లకి దూరంగా బతకాలనుకునే వారు గల్ఫ్‌లో జీవితాన్ని సుఖంగా గడుపుతున్నారా? భారంగా గడుపుతున్నారా? ఇలాంటి ఎన్నో అంశాలతో గల్ఫ్ దేశాలలో నివసిస్తున్న ప్రవాస భారతీయుల జీవితాలపై నిర్మించిన 'గల్ఫ్' చిత్రం త్వరలో విడుదల కానున్నది. ఇందులో కష్టాలతోపాటు అక్కడ ఉండే సంతోషాన్ని, విజయాలను ఓ స్వచ్ఛమైన ప్రేమ కథను చూపిస్తున్నారు.
తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ లతో పాటు అరబ్ గల్ఫ్ దేశాలలో 20 మందిని అంబాసిడర్లు గా నియమిస్తున్నామని, వీరు 'గల్ఫ్' సినిమా కు అధికార ప్రతినిధులుగా వ్యవహరిస్తారని దర్శకుడు పి. సునీల్ కుమార్ రెడ్డి తెలిపారు.
నిర్మల్ జిల్లా తర్లపాడుకు చెందిన యువకుడు గుండేటి గణేష్ గల్ఫ్ దేశమైన ఓమాన్ (మస్కట్) కు 18 ఏళ్ల క్రితం సామాన్యుడిగా వలసవెళ్లి ఒక వ్యాపారవేత్తగా ఎదిగాడు. 'గల్ఫ్' సినిమా ఓవర్సీస్ అంబాసిడర్ గా ప్రవాస భారతీయుడు గుండేటి గణేష్ ను నియమించినట్లు దర్శకుడు పి. సునీల్ కుమార్ రెడ్డి తెలిపారు.
తాజా వార్తలు
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!
- ఖతార్‌లో MotoGP, ఫార్ములా-1 గ్రాండ్‌ప్రి.. వాలంటీర్ల నమోదు ప్రారంభం..!!







