ఆపిల్‌ కోకోనట్‌ హల్వా

ఆపిల్‌ కోకోనట్‌ హల్వా

కావలసిన పదార్థాలు: ఆపిల్‌- ఒకటి, పచ్చి కొబ్బరి తురుము: కప్పు, డ్రైఫ్రూట్స్‌: 20 గ్రాములు, నెయ్యి: తగినంత, చక్కెర: కప్పు, పాలు: కప్పు, యాలకుల పొడి: కొద్దిగా 
తయారీ విధానం: ఆపిల్‌ను తురుముకొని పెట్టుకోవాలి. డ్రైఫ్రూట్స్‌ను నేతిలో వేయించి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మందపాటి గిన్నె తీసుకుని అందులో పాలు, కొద్దిగా నీరు, ఆపిల్‌ తురుము, పంచదార వేసి మెత్తగా ఉడికించుకోవాలి. ఈ మిశ్రమం గట్టిపడేముందు కొబ్బరి తురుము, యాలకుల పొడి వేసి ఒకటి రెండు నిమిషాలు ఉడికించి పైన డ్రైఫ్రూట్స్‌ వేసి దించేయాలి. దీన్ని వేడి వేడిగా లేదా చల్లారిన తరువాత ఫ్రిజ్‌లో కొద్దిసేపు పెట్టుకుని కూడా తీసుకోవచ్చు.

Back to Top