లయగ్రాహి

అచ్చమగు వేడుకగ పచ్చనగు వేదికగ వెచ్చనగు వీచికగ వచ్చెను ఉగాదీ

మెచ్చగనె కోకిలలు హెచ్చగనె రాగములు విచ్చగనె ఉల్లములు వచ్చెను ఉగాదీ

పచ్చివగు మామిడులు గిచ్చగనె నాలుకలు గుచ్చగనె కోరికలు వచ్చెను ఉగాదీ

చిచ్చుగల భాస్కరుడు యిచ్చెనుగ దీవెనలు తెచ్చెనుగ చైత్రమును వచ్చెను ఉగాదీ 

 

ఉండునని సంపదలు పండగనె పుణ్యములు మెండుగనె చాటునది పండుగ ఉగాదీ

దండలుగ బంధములు దండిగనె గంథములు గుండెలలొ నింపుకొను పండుగ ఉగాదీ

భాండమున వంటలను వండగనె ఇంపుగనె నిండుగనె వచ్చునది పండుగ ఉగాదీ

అండయగు దైవముకు దండములు పెట్టగనె కుండలలొ పచ్చడుల పండుగ ఉగాదీ


-సిరాశ్రీ 

Back to Top