ఏప్రిల్ 2న ప్రారంభం దేశంలోనే అతిపెద్ద సొరంగ మార్గం
- March 29, 2017
ఎప్పుడూ ఎన్కౌంటర్లు, ఉద్రిక్తతలతో దద్దరిల్లే జమ్ముకాశ్మీర్ ఒక అద్భుతానికి వేదికవుతోంది. దేశంలోనే అతిపెద్ద సొరంగ మార్గానికి సాక్ష్యంగా నిలుస్తోంది. ఏప్రిల్ 2న ప్రధాని చేతులమీదుగా ప్రారంభం కానున్న ఈ అద్భుతం ఆ రాష్ట్రంలోని రెండు రాజధాని నగరాల మధ్య 30 కిలోమీటర్ల దూరాన్ని తగ్గిస్తుంది.
కొండ చరియలు పడినా భయం లేదు.. భారీ హిమపాతం ముంచెత్తినా.. ఫర్వాలేదు.. వాతావరణం ఎలా ఉన్నా, ఉత్పాతాలు ఎదురైనా వాహనాలకు బ్రేక్ వేయాల్సిన పన్లేదు. 9 కిలోమీటర్లకుపైగా నాన్ స్టాప్ జర్నీ.. జమ్మూ శ్రీనగర్ మధ్య భయంకరమైన మలుపులు తిరిగే రోడ్డు కష్టాలకు సొరంగం చెక్ పెట్టనుంది. ఇదే ఆ సొరగ మార్గం.. దేశంలోనే కాదు.. ఆగ్నేయాసియాలోనే లాంగెస్ట్ హైవే టన్నెల్. జమ్మూ-శ్రీనగర్ నేషనల్ హైవేపై చెనానీ నాశ్రీ మధ్య నిర్మించిన ఈ భారీ సొరంగ మార్గాన్ని ఏప్రిల్ 2న ప్రధాని నరేంద్ర మోడీ జాతికి అంకితం చేయబోతున్నారు. 9.2 కిలోమీటర్లకు పైగా ఉన్న ఈ సొరంగంతో ప్రయాణికుల కష్టాలు తగ్గించి.. తమ ప్రభుత్వ ఘనతను మరోసారి ప్రపంచానికి చాటనున్నారు. మొత్తం 286 కిలోమీటర్ల పొడవున్న జమ్మూ-శ్రీనగర్ నాలుగు లేన్ల 44వ జాతీయ రహదారిపై దీన్ని నిర్మించారు. 9.2 కిలోమీటర్ల సొరంగం నిర్మాణంతో ఆ రాష్ట్రంలోని రెండు రాజధాని నగరాలు శ్రీనగర్-జమ్మూ మధ్య దూరం సుమారు 30 కిలోమీటర్లు తగ్గిపోనుంది. ప్రధాని దీన్ని ప్రారంభించిన తర్వాత ఉధంపూర్‌లో ప్రసంగించనున్నారు. మోడీ పర్యటన ఖరారు కావడంతో అధికారులు ఏర్పాట్లను కూడా శరవేగంగా పూర్తి చేస్తున్నారు
బీజేపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ సొరంగాన్ని మొత్తం 3 వేల 720 కోట్ల వ్యయంతో నిర్మించారు. 2011 మే 23న ప్రారంభమైన ఈ మార్గాన్ని గతేడాది మే నెలకే పూర్తి చేసుండాలి. కానీ కొన్ని టెక్నికల్ సమస్యలతో ఆలస్యమైంది. టూ లేన్ టన్నెల్ ద్వారా ఉధమ్‌పూర్ జిల్లాలోని చెనానీని రంబాన్ జిల్లాలోని నాశ్రీతో కనెక్ట్ అవుతుంది.
తాజా వార్తలు
- యూఏఈ జాబ్ మార్కెట్లో పెను మార్పు: ఇక పై ఆ స్కిల్స్ ఉంటేనే ఉద్యోగం!
- తమిళనాడులో కొత్త సర్కార్ లోడింగ్: ప్రధాని మోదీ
- దుబాయ్ రవాణా వ్యవస్థలో టెక్నాలజీ విప్లవం: జనాభా పెరిగినా ప్రయాణం సాఫీగా!
- లోక్ భవన్లో మణిపూర్, త్రిపుర, మేఘాలయ రాష్ట్రావతరణ దినోత్సవాల వేడుకలు
- అజ్మాన్‌లో 3 నెలలు రోడ్ క్లోజర్: రషీద్ బిన్ అబ్దుల్ అజీజ్ స్ట్రీట్ మూసివేత
- అమెజాన్‌లో మరోసారి లేఆఫ్స్..వేలాది మంది ఉద్యోగుల పై వేటు!
- గవర్నర్ అవార్డ్స్ ఫర్ ఎక్సలెన్స్–2025 అవార్డు గ్రహీతల ప్రకటన
- కేటీఆర్ విచారణ..జూబ్లీహిల్స్ PS వద్ద ఉద్రిక్తత
- వరల్డ్ ఇన్వెస్ట్ మెంట్ ఫోరమ్ 2026కు ఖతార్ హోస్ట్..!!
- సౌదీలో రెసిడెన్స్ ఉల్లంఘనలు..19,559మందికి ఫైన్స్..!!







