అంగరంగ వైభవంగా ముస్తాబైన జిటెక్స్
- March 29, 2017
జిటెక్స్ షాపర్ స్ప్రింగ్ ఎడిషన్ 2017 అంగరంగ వైభవంగా ముస్తాబై ఆహూతుల్ని అలరించేందుకు సిద్ధమైపోయింది. దుబాయ్ వరల్డ్ ట్రేడ్ సెంటర్ అథారిటీ సెకెండ్ వైస్ ఛైర్మన్ ఆఫ్ ది బోర్డ్ - బుటి సయీద్ అల్ ఘాంది ఈ వేడుకిన ప్రారంభించారు. నాలుగు రోజులపాటు దుబాయ్ వరల్డ్ ట్రేడ్ సెంటర్ వద్ద అద్భుతమైన షాపింగ్ అనుభూతిని షాపింగ్ ప్రియులకు అందించనుంది ఈ జిటెక్స్ షాపర్. ప్రపంచ వ్యాప్తంగా పేరొందిన బ్రాండ్స్, ఈ షాపింగ్ ఎగ్జిబిషన్లో తమ ప్రోడక్ట్స్‌ని ప్రదర్శన మరియు అమ్మకానికి ఉంచాయి. అన్ని వర్గాల ప్రజలకూ అనువైన షాపింగ్ ఇక్కడ కొలువుదీరింది. విద్యార్థులు, చిన్న పిల్లలు, మహిళలు ఇలా ఒకరేమిటి, అందరూ ఆనందోత్సాహాలతో షాపింగ్ చేసుకునేలా ఏర్పాట్లు చేశారు. 300 దిర్హామ్‌ల మొత్తానికి ఏదన్నా వస్తువు కొనుగోలు చేసినవారికి ఉచిత పార్కింగ్ సౌకర్యం కల్పిస్తున్నారు. మార్చి 29 నుంచి ఏప్రిల్ 1 వరకు ఈ షాపింగ్ ఫెస్టివల్ సందర్శకుల్ని అలరించనుంది. ఈ ఏడాది జిటెక్స్ షాపర్ కోసం 20 దిర్హామ్‌లను టిక్కెట్ ధరగా నిర్ణయించారు.
తాజా వార్తలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!







