మొదటి జెడ్డా ఫుడ్ ఫెస్టివల్ లో రుచికరమైన సాంస్కృతిక ఆతిధ్యం
- April 02, 2017
జెడ్డా:తొలి జెడ్డా ఫుడ్ ఫెస్టివల్ గత నెల మార్చి 30 వ తేదీ గురువారం నుండి లాంఛనంగా ప్రారంభమైంది. ఒకటో రెండు సాంస్కృతిక కార్యక్రమాలు నగరంలో రోజూ ఒక వినోద సంచలనం కల్గిస్తుంది. జెడ్డా చారిత్రికమైన ఉత్సవం ఏప్రిల్ 8 వ తేదీ (శనివారం ) వరకు కొనసాగనుంది. జెడ్డా కామర్స్ అండ్ ఇండస్ట్రీ జెడ చాంబర్ ( జె సి సి ఐ ) వద్ద గవర్నర్ ప్రిన్స్ మిశాల్ బిన్ మజీద్ రాజుల ఆశ్రయం ఆతిథ్య కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించబడుతున్న ఈ పండుగ రెనాడ్ ఎగ్జిబిషన్ కంపెనీ సహకారంతో కొనసాగనుంది. 30,000 చదరపు మీటర్ల పొడవు విస్తీర్ణంలో ఏర్పాటైన జెడ్డా ఫుడ్ ఫెస్టివల్ లో 114 కంటే ఎక్కువ సంస్థలు, రెస్టారెంట్లు ఆసియా దేశాల నుండి సంప్రదాయ అరబిక్ వంటకాలలో తమ వాటిని ప్రదర్శించనున్నారు. ఈ కార్యక్రమంలో కడుపుబ్బ నవ్వించే హాస్యం, ప్రేక్షకులను ఆకట్టుకొనే థియేటర్ ప్రదర్శన మరియు ప్రత్యక్ష వంట కార్యక్రమాలతో ఆకట్టుకున్నారు.కుటుంబాలు మరియు పిల్లల ఆనందంతో సహా 35 వివిధ రకాల వినోద కార్యకలాపాలను నిర్వాహకులు ఏర్పాటుచేశారు. జెడ్డా కామర్స్ అండ్ ఇండస్ట్రీ జెడ చాంబర్ ( జె సి సి ఐ ) వైస్ చైర్మన్ మాజం బత్తెర్జీ ఈ సందర్భంగా మాట్లాడుతూ, సాంస్కృతిక మార్పిడిలో ఆహరం చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుందని చెప్పారు. పాఠశాల విరామ సమయంలో జరుగుతున్న ఈ జెడ్డా ఫుడ్ ఫెస్టివల్ కు వివిధ దేశాల నుంచే హాజరయ్యే పలువురు సందర్శకులకు ప్రజలకు తాము వినూత్న ఆతిధ్యం ఇస్తున్నట్లు తెలిపారు. వివిధ రకాల రుచులను ఆస్వాదించడానికి ఈ ఉత్సవం ఒక చక్కని అవకాశం అని ఆయన అన్నారు. జెడ్డా కామర్స్ అండ్ ఇండస్ట్రీ జెడ చాంబర్ ( జె సి సి ఐ ) వద్ద ఆతిధ్య కమిటీ చైర్మన్ ఎ.మునిఎఫ్ మహమ్మద్ మక్కి మాట్లాడుతూ, జెడ్డా ఫుడ్ ఫెస్టివల్, వార్షిక కార్యక్రమం మాదిరిగా మారిందని దేశీయ పర్యాటక రంగానికి మద్దతు పలికే ఇదో బృహత్తర కార్యక్రమం అని పేర్కొన్నారు సౌదీ ఆతిథ్య పరిశ్రమ ద్వారా విదేశీ, స్థానిక పెట్టుబడులు ఆకర్షించడానికి ప్రోత్సహించడానికి దోహదపడుతుందని భావిస్తున్నట్లు చెప్పారు.
తాజా వార్తలు
- అల్ కూజ్ లో 478 మంది కార్మికులకు సైబర్ భద్రతపై దుబాయ్ పోలీసుల అవగాహన
- 2027–2029 కాలానికి దిర్హామ్స్ 292.5 బిలియన్ల యూఏఈ ఫెడరల్ బడ్జెట్‌కు ఆమోదం
- మరో రెండు రోజుల్లో గ్లోబల్ విలేజ్ సీజన్ 31 ప్రారంభం..
- హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో రియల్‌టైమ్ లాస్ట్ అండ్ ఫౌండ్ ట్రాకింగ్ ప్రారంభం
- తొలి డీఎస్పీ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్.. 112 మంది అధికారులకు డీజీపీ ఆనంద్ అభినందనలు
- ఊపిరితిత్తుల్లో నాడ్యూల్.. పోప్ లియోకు త్వరలో శస్త్రచికిత్స
- అక్టోబర్ 17 వరకు రియాద్ విమానాశ్రయం మూసివేత
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్‌లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం







