రేసింగ్ సీజన్‌కి సమాయత్తమైన బహ్రెయిన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్
- April 03, 2017
మనామా: బహ్రెయిన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ (బిఐఎ), ఈ ఏడాది ఫార్ములా వన్ గల్ఫ్ ఎయిర్ బహ్రెయిన్ గ్రాండ్ పిక్స్ కోసం వచ్చే అంతర్జాతీయ అతిథులకోసం సర్వసన్నద్ధమయ్యింది. ఏప్రిల్ 14 నుంచి 16 వరకు ఈ గ్రాండ్ ప్రిక్స్ జరగనుంది. ప్రయాణీకులు, కార్గో మూమెంట్‌ని రద్దీకి అనుగుణంగా అత్యంత పకడ్బందీగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసినట్లు బహ్రెయిన్ ఎయిర్పోర్ట్ కంపెనీ వెల్లడించింది. పెద్ద సంఖ్యలో ప్రయాణీకులు వస్తారని తాము అంచనా వేశామని బిఎసి అధికారులు తెలిపారు. బిఎసి చీఫ్ ఎయిర్పోర్ట్ ఆపరేషన్స్ ఆఫీసర్ మైఖేల్ హోహాెన్బెర్గర్ మాట్లాడుతూ, ఎఫ్1 రేస్ నేపథ్యంలో 10,000 నుంచి 14,000 మంది ప్రయాణీకులు వస్తారని అంచనా వేస్తున్నట్లు చెప్పారు. ఈవెంట్‌ని విజయవంతం చేయడం కోసం తమవంతుగా సహాయ సహకారాలు అందిస్తామని ఆయన వివరించారు.
తాజా వార్తలు
- ఖతార్‌లో అక్టోబర్ 16న ‘ఫెస్టివల్ ఆఫ్ వెకేషన్ అండ్ ఫన్’..!!
- యూఏఈలో ఫేస్ మాస్కుల రీకాల్.. నాణ్యత లోపాలపై హెచ్చరిక..!!
- సౌదీ అరేబియాలో 2026 మిస్క్ గ్లోబల్ ఫోరం రద్దు..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో బీభత్సం..!!
- టీమ్ ఇండియాలో కొత్త ఆల్‌రౌండర్.. !
- కువైట్‌లో ర్యాష్ డ్రైవింగ్.. ప్రభుత్వ ఆస్తులకు నష్టం..!!
- ఒమన్, అర్మేనియా చర్చలు..పలు కీలక అంశాలపై సమీక్ష..!!
- బహ్రెయిన్ పౌరులకు విద్యుత్, నీటి బిల్లుల్లో ఊరట..!!
- అబుదాబి–రియాద్ విమాన సర్వీసులు రద్దు.. అక్టోబర్ 19 వరకు నిలిపివేత
- అల్ కూజ్ లో 478 మంది కార్మికులకు సైబర్ భద్రతపై దుబాయ్ పోలీసుల అవగాహన







