కతర్ లో 67 మంది భారతీయుల మృతి
- April 03, 2017
ఈ ఏడాది మొత్తం 67 మంది భారతీయులు మృతి చెందినట్లు దోహాలోని ఇండియన్ ఎంబసీ వెల్లడించిన వివరాల ప్రకారం అర్థమవుతోంది. కమ్యూనిటీ హౌస్ కార్యక్రమంలో ఈ వివరాలు వెల్లడయ్యాయి. మార్చి 29 వరకు నమోదైన మరణాల సంఖ్య ఇది. సెంట్రల్ ప్రిజన్లో 180 మంది భారతీయులు శిక్ష అనుభవిస్తుండగా, 80 మంది డిపోర్టేషన్ కోసం ఎదురుచూస్తున్నారు. ఎంబసీ ప్రతినిథుల బృందం డిపోర్టేషన్కి సంబంధించి అధికారులతో మంతనాలు జరుపుతోంది. ఇంకో వైపున లేబర్ అండ్ కమ్యూనిటీ వెల్ఫేర్ సెక్షన్ - ఎంబసీ మొత్తం 674 ఫిర్యాదుల్ని మార్చి 30 వరకు అందుకుంది. ఇందులో 514 ఫిర్యాదుల్ని పరిష్కరించగా, 69 ఇంకా ఫాలో అప్లో ఉన్నాయి. కమ్యూనిటీ హౌస్ కార్యక్రమంలో అంబాసిడర్ పి కుమారన్, డిప్యూటీ చాఫ్ ఆఫ్ మిషన్ ఆర్కె సింగ్ మరికొందరు అధికారులు హాజరయ్యారు. ఇండియన్ కమ్యూనిటీ బెనెవోలెంట్ ఫోరమ్ ప్రెసిడెంట్ డేవిస్ ఎడాకాలాతూర్ కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
తాజా వార్తలు
- ఖతార్లో అక్టోబర్ 16న ‘ఫెస్టివల్ ఆఫ్ వెకేషన్ అండ్ ఫన్’..!!
- యూఏఈలో ఫేస్ మాస్కుల రీకాల్.. నాణ్యత లోపాలపై హెచ్చరిక..!!
- సౌదీ అరేబియాలో 2026 మిస్క్ గ్లోబల్ ఫోరం రద్దు..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో బీభత్సం..!!
- టీమ్ ఇండియాలో కొత్త ఆల్రౌండర్.. !
- కువైట్లో ర్యాష్ డ్రైవింగ్.. ప్రభుత్వ ఆస్తులకు నష్టం..!!
- ఒమన్, అర్మేనియా చర్చలు..పలు కీలక అంశాలపై సమీక్ష..!!
- బహ్రెయిన్ పౌరులకు విద్యుత్, నీటి బిల్లుల్లో ఊరట..!!
- అబుదాబి–రియాద్ విమాన సర్వీసులు రద్దు.. అక్టోబర్ 19 వరకు నిలిపివేత
- అల్ కూజ్ లో 478 మంది కార్మికులకు సైబర్ భద్రతపై దుబాయ్ పోలీసుల అవగాహన







