భారత ఐటీకి సింగపూర్ షాక్
- April 03, 2017
భారత ఐటీ సంస్థలు, ప్రొఫెనల్స్ వీసాలపై ఇప్పటికే అమెరికా ఆంక్షలు విధించగా, ఇప్పుడు అదే బాటలో మరో దేశం నడుస్తోంది. తమ దేశంలో ఉన్న భారత ఐటీ కంపెనీలు స్థానికులకే అవకాశాలు ఇవ్వాలని అక్కడి ప్రభుత్వం స్పష్టంచేసింది.
భారత ఐటీ ప్రొఫెషనల్స్‌కు జారీ చేసే వీసాలను గణనీయంగా తగ్గించింది. దీంతో ఐటీ కంపెనీలు ఇతర దేశాల వైపు చూసే పరిస్థితి ఏర్పడింది. అయితే, ఇది వాణిజ్య ఒప్పందాలను ఉల్లంఘించడమే అవుతుందని భావిస్తున్న భారత ప్రభుత్వం.. కాంప్రెహెన్సివ్ ఎకనామిక్ కో-ఆపరేషన్ అగ్రిమెంట్(సీఈసీఏ) పునఃసమీక్షపై పునరాలోచన చేస్తోంది.
సింగపూర్ తీసుకున్న ఈ నిర్ణయం హెచ్‌సీఎల్, టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో, కాగ్నిజెంట్, ఎల్ అండ్ టీ కంపెనీలపై ప్రభావం చూపనుంది.
ఇది ఎప్పటి నుంచో జరుగుతున్నా.. గత సంవత్సరం మొదటి నుంచీ వీసాల జారీని గణనీయంగా తగ్గించారని, స్థానికులకే ఉద్యోగావకాశాలు ఇవ్వాలని సింగపూర్ ప్రభుత్వం కంపెనీలకు స్పష్టంచేసిందని నాస్కామ్ అధ్యక్షుడు చంద్రశేఖర్ వెల్లడించారు.
ఎకనామిక్ నీడ్స్ టెస్ట్ అంటూ ఆర్థిక కారణాలను సాకుగా చూపుతూ సింగపూర్ భారత ఐటీ ప్రొఫెషనల్స్‌కు వీసాలను నిరాకరిస్తోంది. సీఈసీఏ ఒప్పందాన్ని ఇది ఉల్లంఘించడమే అవుతుందని ఓ భారత అధికారి తెలిపారు. అమెరికా, తర్వాత సింగపూర్ కూడా వీసాలు తగ్గించడంపై భారత ఐటీ సంస్థలు, ప్రొఫెషనల్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
తాజా వార్తలు
- జార్జియాలోని సిక్స్ ఫ్లాగ్స్ రోలర్ కోస్టర్ ప్రమాదంలో ఒకరు మృతి, పలువురికి గాయాలు
- దుబాయ్‌లో ఘనంగా ‘ఇసుక తిన్నెల పై బతుకమ్మ’ పాట ఆవిష్కరణ
- ఖతార్‌లో అక్టోబర్ 16న ‘ఫెస్టివల్ ఆఫ్ వెకేషన్ అండ్ ఫన్’..!!
- యూఏఈలో ఫేస్ మాస్కుల రీకాల్.. నాణ్యత లోపాలపై హెచ్చరిక..!!
- సౌదీ అరేబియాలో 2026 మిస్క్ గ్లోబల్ ఫోరం రద్దు..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో బీభత్సం..!!
- టీమ్ ఇండియాలో కొత్త ఆల్‌రౌండర్.. !
- కువైట్‌లో ర్యాష్ డ్రైవింగ్.. ప్రభుత్వ ఆస్తులకు నష్టం..!!
- ఒమన్, అర్మేనియా చర్చలు..పలు కీలక అంశాలపై సమీక్ష..!!
- బహ్రెయిన్ పౌరులకు విద్యుత్, నీటి బిల్లుల్లో ఊరట..!!







