7న విడుదల కానున్న 'శరణం గచ్ఛామి'
- April 03, 2017
నవీన్ సంజయ్ హీరోగా బొమ్మకు క్రియేషన్స్ పతాపంపై రూపుదిద్దుకున్న చిత్రం ‘శరణం గచ్ఛామి’. ఇటీవల సెన్సారు ఇబ్బందులు ఎదుర్కొన్న ఈ చిత్రాన్ని ఏప్రిల్ 7న విడుదల చేస్తున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. ప్రేమరాజ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ప్రీ రిలీజ్, ప్లాటినం డిస్క్ ఫంక్షన్‌ను ప్రొడ్యూసర్ కౌన్సిల్ హాల్లో సోమవారం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో చిత్ర బృందం పాల్గొని ప్రసంగించింది.
ఈ సందర్భంగా నిర్మాత మురళి మాట్లాడుతూ.. చిత్రం రూపకల్పనలో సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు. కథ, కథనాలతోపాటు రవి కళ్యాణ్ సంగీతం, సుద్దాల సాహిత్యం, పరుచూరి వెంకటేశ్వరరావు తదితరుల నటన ‘శరణం గచ్ఛామి’ చిత్రానికి ముఖ్య ఆకర్షణలని పేర్కొన్నారు.
ఇంత మంచి చిత్రంలో భాగస్వాములు అయినందుకు పరుచూరి, సుద్దాల, నవీన్ సంజయ్ ఆనందం వ్యక్తం చేశారు.
తాజా వార్తలు
- జార్జియాలోని సిక్స్ ఫ్లాగ్స్ రోలర్ కోస్టర్ ప్రమాదంలో ఒకరు మృతి, పలువురికి గాయాలు
- దుబాయ్‌లో ఘనంగా ‘ఇసుక తిన్నెల పై బతుకమ్మ’ పాట ఆవిష్కరణ
- ఖతార్‌లో అక్టోబర్ 16న ‘ఫెస్టివల్ ఆఫ్ వెకేషన్ అండ్ ఫన్’..!!
- యూఏఈలో ఫేస్ మాస్కుల రీకాల్.. నాణ్యత లోపాలపై హెచ్చరిక..!!
- సౌదీ అరేబియాలో 2026 మిస్క్ గ్లోబల్ ఫోరం రద్దు..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో బీభత్సం..!!
- టీమ్ ఇండియాలో కొత్త ఆల్‌రౌండర్.. !
- కువైట్‌లో ర్యాష్ డ్రైవింగ్.. ప్రభుత్వ ఆస్తులకు నష్టం..!!
- ఒమన్, అర్మేనియా చర్చలు..పలు కీలక అంశాలపై సమీక్ష..!!
- బహ్రెయిన్ పౌరులకు విద్యుత్, నీటి బిల్లుల్లో ఊరట..!!







