గోవాలో ఎంజాయ్ చేస్తున్న బన్నీ
- April 03, 2017
స్టార్ హీరోగా వరుస సినిమాలతో బిజీగా ఉన్నప్పటికీ కుటుంబంతో గడిపే అవకాశాన్ని ఏ మాత్రం వదులుకోవడం లేదు ఇప్పటి సినిమా హీరోలు. ఖాళీగా ఉన్నప్పుడు కుటుంబంతో గడపడం స్టైలిష్‌స్టార్ అల్లు అర్జున్‌కు అలవాటు. వృతిపరమైన విషయాలనే కాకుండా వ్యక్తిగత విషయాలను కూడా సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకోవడం కూడా బన్నీకి అలవాటు. తన భార్య స్నేహారెడ్డితో తీయించుకున్న సెల్ఫీని ఆదివారం పోస్ట్ చేసిన బన్నీ.. ముద్దుల తనయుడు అయాన్‌తో కలిసి ఈత కొడుతూ తీయించుకున్న ఫోటోను సోమవారం పంచుకున్నాడు. అయాన్ పుట్టినరోజు సందర్భంగా బన్నీ తన కుటుంబసభ్యులతో కలిసి గోవాకు విహారయాత్రకు వెళ్లాడు. ఈ ట్రిప్‌లో భాగంగా కొడుకుతో కలిసి స్విమ్మింగ్ చేస్తున్న ఫోటోను తన ఫేస్‌బుక్ ఖాతాలో పోస్ట్ చేశాడు బన్నీ.
అంతేకాకుండా 'మా బర్త్‌డే బాయ్‌తో గోవాలో విహారయాత్ర' అంటూ కామెంట్ కూడా రాశాడు. ఈ ట్రిప్ కోసం బన్నీ 'దువ్వాడ జగన్నాథమ్' షూటింగ్‌కు స్వల్ప విరామం ఇచ్చాడు.
తాజా వార్తలు
- విద్యార్థులపై దాడి.. ఉపాధ్యాయుడికి రెండేళ్ల జైలు శిక్ష, దేశ బహిష్కరణ
- వాట్సాప్‌లో సరికొత్త ఫీచర్..
- జార్జియాలోని సిక్స్ ఫ్లాగ్స్ రోలర్ కోస్టర్ ప్రమాదంలో ఒకరు మృతి, పలువురికి గాయాలు
- దుబాయ్‌లో ఘనంగా ‘ఇసుక తిన్నెల పై బతుకమ్మ’ పాట ఆవిష్కరణ
- ఖతార్‌లో అక్టోబర్ 16న ‘ఫెస్టివల్ ఆఫ్ వెకేషన్ అండ్ ఫన్’..!!
- యూఏఈలో ఫేస్ మాస్కుల రీకాల్.. నాణ్యత లోపాలపై హెచ్చరిక..!!
- సౌదీ అరేబియాలో 2026 మిస్క్ గ్లోబల్ ఫోరం రద్దు..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో బీభత్సం..!!
- టీమ్ ఇండియాలో కొత్త ఆల్‌రౌండర్.. !
- కువైట్‌లో ర్యాష్ డ్రైవింగ్.. ప్రభుత్వ ఆస్తులకు నష్టం..!!







