మోటారు బైకులపై ప్రయాణిస్తూ చోరీలకు పాల్పడుతున్న యువకులు అరెస్ట్
- April 03, 2017
మస్కట్ : కళాశాలలో హాయిగా చదువుకోవాల్సిన కుర్రోళ్ళు విలాసాలకు అలవాటు పడి దొంగతనాలు హాబీగా మార్చుకొన్నారు చివరకు కట కటాల పాలయ్యారు. విలయత్ లోని సోహ్ర లో ప్రజల మధ్యలో ఉండి దొంగతనం చేయడం వెనువెంటనే రెప్పపాటులో అక్కడనుంచి మోటార్ బైకులపై వేగంగా పారిపోతున్న ఓ ముగ్గురు యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు. విచారణలు మరియు నేర పరిశోధనల యొక్క డైరెక్టరేట్ జనరల్ పరిధిలో ఆ ముగ్గురు నిందితులు అరెస్టు చేసినట్లు తెలిపారు. వీరు సోహ్ర ఫలాజ్ అల్ ఖ్యాబైల్ ప్రాంతాలలో (16 , 17 సంవత్సరాల మధ్య వయస్సు గల యువకులు) యువకులు ఉత్తర బత్తినహ్ పోలీసు ప్రధాన కార్యాలయం నుంచి ఒక అధికారి తెలిపారు.వారు ప్రజలలే లక్ష్యంగా చేసుకొనే మోటారుబైకులపై నగరం చుట్టూ తిరుగుతూ దొంగతనం కోసం ఆ యువకుల అనేక సందర్భాల్లో పాల్గొన్నారు. "వారు ప్రజల నుండి మొబైల్ మరియు ఇతర వస్తువులు లాక్కొని పారిపోతుంటారని మరియు చోరీ చేసిన స్థలం నుండి తప్పించుకోవడానికి మోటార్ బైకులు ఉపయోగిస్తారని ఆ అధికారి తెలిపారు. పరిశోధనలు ఆధారంగా ఆ యువకులను అరెస్టు చేశామని వారిపై ఉన్న ఆరోపణలు నేరాలు గూర్చి తదుపరి దర్యాప్తు కోసం పబ్లిక్ ప్రాసిక్యూషన్ ఎదుటకు పంపనున్నట్లు ఆ అధికారి తెలిపారు.
తాజా వార్తలు
- అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సౌదీ సిద్ధం..!!
- బహ్రెయిన్‌లో పర్యాటక వీసాలకు హెల్త్ ఇన్సూరెన్స్ ఫీజు..!!
- అబుదాబిలో నలుగురు విద్యార్థులపై దాడి.. టీచర్‌కు రెండేళ్ల జైలు శిక్ష..!!
- కువైట్‌లో అపార్ట్మెంట్లో అగ్నిప్రమాదం.. ఇద్దరికి గాయాలు..!!
- ఖతార్‌లో ఉరుములు, మెరుపులతో వర్షాలు.. వాతావరణ శాఖ హెచ్చరిక..!!
- ఒమన్‌లోని మస్కట్ పెట్రోల్ బంకుల్లో విస్తృత తనిఖీలు..!!
- విద్యార్థులపై దాడి.. ఉపాధ్యాయుడికి రెండేళ్ల జైలు శిక్ష, దేశ బహిష్కరణ
- వాట్సాప్‌లో సరికొత్త ఫీచర్..
- జార్జియాలోని సిక్స్ ఫ్లాగ్స్ రోలర్ కోస్టర్ ప్రమాదంలో ఒకరు మృతి, పలువురికి గాయాలు
- దుబాయ్‌లో ఘనంగా ‘ఇసుక తిన్నెల పై బతుకమ్మ’ పాట ఆవిష్కరణ







