ముస్లిం ప్రార్థనను నైట్‌క్లబ్‌లో రీమిక్స్ చేసిన వైనం
- April 05, 2017
నైతిక విలువకు తిలోదకాలిస్తూ ముస్లిం ప్రార్థనను రీమిక్స్ చేసినందుకు ఓ నైట్‌క్లబ్ మూతపడింది. నెబ్యూల్లోని నైట్‌క్లబ్‌లో ఓ యూరోపియన్ డీజే ముస్లిం ప్రార్థనను రీమిక్స్ చేయడమే కాకుండా దానికి నృత్యం చేశాడు. క్లబ్‌కి వచ్చిన వాళ్లుకూడా అతడితో పాటు డ్యాన్స్ చేశారు. దీని తాలూకు వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ కావడం, ప్రజాగ్రహం పెల్లుబుకడంతో అధికారులు ఉరుకులు పరుగుల మీద సదరు నైట్‌క్లబ్ మూసివేశారు. క్లబ్ మేనేజర్‌ను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. ''నైతిక విలువలను ఉల్లంఘించడం, ప్రజాగ్రహం వెల్లువెత్తిన కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నాం. మతాచారాలపై దాడి చేయడాన్ని ఏమాత్రం సహించబోం..'' నెబ్యూల్ గవర్నర్ ప్రకటించారు.
కాగా తాను కావాలని గానీ, ఎవర్నీ బాధపెట్టాలన్న ఉద్దేశ్యంతో గానీ ఈ మ్యూజిక్ రూపొందించ లేదని డీజే చెబుతున్నాడు.. దీని వల్ల గాయపడిన అందరికీ క్షమాపణ చెబుతున్నట్టు పేర్కొన్నాడు.
తాజా వార్తలు
- ఖతార్‌లో కొత్త చెల్లింపు విధానాలు..!!
- అబుదాబిలో వేర్ హౌజ్ లో భారీ అగ్నిప్రమాదం..!!
- రియాద్ విమానాశ్రయంపై దాడి.. క్షతగాత్రులను పరామర్శించిన సౌదీ ఆరోగ్య మంత్రి..!!
- కువైట్‌లో నవంబర్ 29, 30 తేదీల్లో అంతర్జాతీయ సదస్సు, ఎగ్జిబిషన్..!!
- సౌదీ అరేబియా కింగ్ ఖాలిద్ విమానాశ్రయంపై దాడి.. ఒకరు మృతి, 11 మందికి గాయాలు
- ఒమన్ రాయల్ ఆసుపత్రిలో తొలిసారిగా అధునాతన గుండె చికిత్స..!!
- సహోద్యోగి మృతి.. ఆసియా మహిళకు ఏడాది జైలు శిక్ష..!!
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్







