మహేష్ బాబు కొరటాల శివ దర్శకత్వంలో 'భరత్ అను నేను' మే లో ప్రారంభం
- April 06, 2017
ఇటీవల స్టార్ హీరోలు వెంట వెంటనే సినిమాలు చేయాలని భావిస్తోండడమే కాదు.. వెంట వెంటనే సినిమాలను ప్రారంభిస్తున్నారు కూడా తాజాగా ప్రిన్స్ మహేష్ బాబు ఒక సినిమా పూర్తి అయిన వెంటనే మరో సినిమాను పట్టలెక్కించే దిశగా అడుగు వేడుస్తున్నాడు. మురగదాస్ తో సినిమా పూర్తి కాగానే.. కొరటాల శివ దర్శకత్వంలో సినిమాలో నటించనున్నాడు.. ఇప్పటి వరకూ కొరటాల శివ తన కధాలకు తానే దర్శకత్వం వహించగా.. మొదటి సరిగా ఈ సినిమా కోసం వేరే రచయిత కధను తీసుకొన్నాడు. నను శ్రీహరి ఈ సినిమాకు కధను అందిస్తున్నారు... "భరత్ అను నేను" టైటిల్ ప్రచారంలో ఉన్నది.. ప్రస్తుతం శివ ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులతో బిజీ బిజీగా ఉన్నాడు.. నెక్స్ట్ మంత్ లో ప్రారంభోత్సవం జరుపుకోనున్న ఈ సినిమాలో మహేష్ బాబు ఓ ఎన్నారై గా నటించనున్నాడట.. అందుకని షూటింగ్ ని మొదట విదేశాల్లో చెయ్యడానికి చిత్ర యూనిట్ సన్నాహాల్లో ఉన్నది.. లండన్ లో ఈ సినిమా షూటింగ్ ను ప్రారంభించాలని కొరటాల శివ భావిస్తున్నట్లు సమాచారం.. దేవి శ్రీ ప్రసాద్ మరో సారి తన సంగీత మ్యాజిక్ ను చెయ్యడానికి రెడీ అవుతున్నాడు.. ఇప్పటికే సాంగ్స్ సిటింగ్ జరుపుకొంటున్నది. కాగా ఈ సినిమాలో మహేష్ కు జోడీగా బాలీవుడ్ హీరోయిన్ ను ఎంపిక చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది.
తాజా వార్తలు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!
- ఖతార్‌లో MotoGP, ఫార్ములా-1 గ్రాండ్‌ప్రి.. వాలంటీర్ల నమోదు ప్రారంభం..!!
- దుబాయ్‌లో తక్కువ అద్దె ఇళ్లపై ప్రవాసుల ఆశలు.. కొత్త నిబంధనలతో ఊరట..!!
- అయోవాలో దిగ్విజయంగా NATS క్రికెట్ టోర్నమెంట్
- జెవర్ ఎయిర్‌పోర్ట్‌కు ‘నరేంద్ర మోడీ’ పేరు.. క్యాబినెట్ ఆమోదం
- చార్లెట్ లో వైభవంగా NATS తెలుగు సంబరాలు







