రష్యాలో దారుణం : చెల్లిని 140 సార్లు కత్తితో పొడిచి చంపేశాడు
- April 07, 2017
రష్యాలో దారుణం జరిగింది. తన చెల్లి ఓ మోడల్‌గా మంచి పేరు గడించడాన్ని జీర్ణించుకోలేని ఓ అక్క అత్యంత క్రూరంగా హత్య చేసింది. చెల్లిని ఏకంగా 140 సార్లు కత్తితో పొడిచి.. కనుగుడ్లు పీకేసి.. చెవులు కత్తిరించి మరీ చంపేసింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే...
రష్యాలోని సెయింట్ పీటర్స్బర్గ్ ప్రాంతంలో నివాసముండే స్టెఫానియా డుబ్రోవినా ఆ దేశంలో ఉన్న టీనేజ్ మోడళ్ళలో ఒకరు. మంచి పేరు కూడా ఉంది. ఈమె అక్క ఎలిజవెటా, మరో వ్యక్తితో కలిసి ఇంట్లోనే డ్రగ్స్ సేవించారు. మందు నిండుకోవడంతో కొనుక్కుని రావడానికి ఆ వ్యక్తి బయటకెళ్లాడు. అతను బయటకు వెళ్లగానే ఎలిజవెటా తలుపులన్నీ మూసేసి, చెల్లెలిని దారుణాతి దారుణంగా పొడిచి చంపింది.
ఏకంగా 140 సార్లు కత్తితో పొడిచి, కనుగుడ్లు బయటకు లాగేసి, చెవులు కోసేసి మరీ చంపింది. అంతటితో ఆమె కసి చల్లారలేదు. చెవులు కోసేసి, నానా బీభత్సం సృష్టించింది. ఆ తర్వాత మృతదేహానికి బాగా జుట్టు దువ్వి, మేకప్ చేసింది కూడా. చెల్లెలికి మోడల్‌గా బాగా పేరు రావడంతో ఈర్ష్య తట్టుకోలేకనే ఆమె ఇలా చేసిందని పోలీసులు భావిస్తున్నారు. దీనిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.
తాజా వార్తలు
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!
- కువైట్‌లో బుక్ డొనేషన్ డ్రైవ్..!!
- యూఏఈలో ఆత్మహత్యాయత్నం ఇక నేరం కాదు..!!
- ఒమన్‌లో వరుస చోరీలు.. ఏడుగురు నిందితులు అరెస్ట్..!!
- దుబాయ్‌లో షేరింగ్ వసతికి అనుమతించిన ప్రాంతాల పూర్తి జాబితా..
- ఖతార్‌లో డ్రైవింగ్ స్కూళ్లకు కొత్త నిబంధనలు..!!
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం







