కాల భ్రమణం

- September 29, 2015 , by Maagulf

http://www.maagulf.com/godata/images/201509/Jay_1443418251.jpg

బుద్ది దెలిసినప్పట్నుండి అమ్మ దిట్టిన అన్నగొట్టిన 

బుజాలమిదెక్కించుకొని బుజ్జగించినవు 

 

నేను ఎక్కడెక్కడో దిరిగి ఆటలాడి వచ్చి విడిచిన 

మురికి బట్టలను తెల తెల్లని మల్లెపూల్లాగా ఉతికి 

మాయ జేసితివి 

 

ఇంకా నేను కొద్ది కొద్దిగా నీ కాయ కష్టం జేసిన చేతుల్లో 

పెరిగి యుక్తవయస్సులో సోపతుల్తో కలిసి దావతులకెల్లొచ్చి

మంచమ్మీదవడుకుంటే,లేరా నాన్న లే కొంచెం బువ్వదిని 

పడుకుందులే బుజ్జగించితివి 

 

ఇన్నిజేసినా నిన్ను నేను విడిచి సముద్రాలు  దాటి వెళ్లినా 

నాలుగు పైసలు సంపాదించుకొని నల్గురిలో మంచిగా బ్రతుకుతాడ్లే 

అనుకుంటివి 

 

నా బ్రతుకు సూడకముందే,నిన్ను క్యాన్సర్ భూతం తింటున్నప్పుడు 

నీ ఋణం తీర్చుకోవడానికి సీసలకొద్దీ రక్తమెక్కిచ్చినా, ఆ రక్త కణాలతో 

పోరాడి ఓడి,నీ కన్న తల్లిని వెదుక్కుంటూ వెల్లిపోతివి నాన్న.. 

 

నువ్వెల్లిన మాకు అండగా భీష్మచార్యునిలాంటి మా చిన్నాన్న 

ఉన్నాడనుకుంటే నీలాగే గాదే,గదే పట్నంలా నీ అటువంటి రోగంతో 

నీ అడుగు జాడల్లోనే వెళ్ళిపోయే 

 

ఎంత ఏడ్చినా ఎంత బాధపడ్డ మీ దారిన మీరెల్లిపోతిరి.. ఇక మేమేం చేయం 

ఈ కాల భ్రమణంలో మీరూదిన ఊపిరులను మా వారసులకూదుతూ....  రావడం తప్ప.

 

--జయ రెడ్డి బోడ(అబుధాబి)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com