ఏది పాపం, ఏది పుణ్యం
- September 29, 2015

ఒక్క క్షణం ఆలోచించి చదవండి ;భగవంతుని విషయం లో ప్రతి దానికి ఒక హేతు బద్దత కలిగి ఉండాలి; అదేదో ఊరి నుండి మహా శిల్పి వచ్చాడు. మరేదో ఊరి నుండి పెద్ద బండ తెచ్చాడు ఆరడుగుల కొలత పెట్టి బండను ఖండించాడు. మిగిలిన మూడు అడుగుల ముక్కను ప్రక్కకు తోసేసాడు. ఆరడుగుల బండ ఏమో విగ్రహం అయి వెలసింది. మూడు అడుగుల బండ ఏమో చాకిరేవు కి చేరింది. కంపు కంపు మనసులు అన్ని దేవుని ఎదుట నిలిచాయి. కంపుకొట్టే బట్టలు అన్ని బండ చుట్టూ చేరాయి. గొంతెమ్మ కోర్కెలు గొంతులు అన్ని తీర్ధం తో తడిసాయి. మురికి బట్టలు మూటలు అన్ని నీటిలో మునిగాయి. అర్ధం గాని స్త్రోత్రాలు తో పూజారి భక్తీ శ్రద్దలు. చాకలి నోటి వెంట ఇష్ ఇష్ శబ్దాలు. శత గోపం పవిత్రం గ ప్రతి తలను తాకుతుంది. పవిత్రత కి ప్రతి బట్ట బండను తాకుతుంది. కడకు గుడి నుండి మనసులు అన్ని కంపు తోనే వెళ్ళాయి. చాకలి రేవు నుండి బట్టలు అన్ని ఇంపు గ వెళ్ళాయి. ఇప్పుడు చెప్పండి ఏది నిజం గుడిలోని దేవుడా చాకలి రేవులోని బండా ... ఏది పాపం ఏది పుణ్యం ...
--వాసుదేవ రావు(బహ్రెయిన్)
తాజా వార్తలు
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- మరో మలేసియా విమానం మిస్సింగ్ 11 మంది పై ఉత్కంఠ!







