ప్రతి రోజు మారనున్న ఆయిల్ ధరలు
- April 07, 2017
ఇక నుండి ప్రతి రోజూ ఆయిల్ కంపెనీలు పెట్రోల్, డీజీల్ ధరలను సమీక్షించనున్నాయి. రోజుకోసారి పెట్రోల్, డీజీల్ రేట్లు హెచ్చు తగ్గుదలలు కన్పించనున్నాయి. అంతర్జాతీయ ధరలకు అనుగుణంగా ధరలను ప్రతి రోజూ సమీక్షించాలని ఆయిల్ కంపెనీలు యోచిస్తున్నాయి. గతంలో ప్రతి పదిహేను రోజులకు ఓసారి పెట్రోల్, డీజీల్ ధరలనుసమీక్షించేవారు.అంతర్జాతీయ మార్కెట్ లో క్రూడ్ ఆయిల్ ధరలకు అనుగుణంగా పెట్రోల్, డీజీల్ ధరలలో మార్పులు చేసేవారు. అయితే అంతర్జాతీయ మార్కెట్ లో క్రూడాయిల్ ధరల ఆధారంగా ప్రతి రోజు పెట్రోల్ , డీజీల్ ధరలను సమీక్షించాలని ఆయిల్ కంపెనీలు రంగం సిద్దం చేస్తున్నాయి.దేశీయ ఆయిల్ రిటైల్ మార్కెట్ ను 95 శాతం తమ చెప్పుచేతల్లో ఉంచుకొన్న ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ , భారత్ పెట్రోలియం, హిందూస్తాన్, పెట్రోలియం కంపెనీలు ఈ మేరకు అడుగులు వేస్తున్నాయి. ఈ మేరకు ఓ ఆయిల్ కంపెనీకి చెందిన టాప్ ఎగ్జిక్యూటివ్ ఈ విషయాన్ని వెల్లడించారు. రోజు వారీ ధరల సమీక్ష ఆధారంగా పెట్రోల్ , డీజీలు ధరలను మార్చనున్నట్టు ఆయన చెప్పారు. దీనికి అవసరమైన టెక్నాలజీ కూడ అందుబాటులో ఉన్నట్టు ఆ టాప్ ఎగ్జిక్యూటివ్ చెప్పారు. అందుబాటులో ఉన్న డిజిటల్ టెక్నాలజీలు, సోషల్ నెట్ వర్క్ లు కూడ రోజువారీ ధరల మార్పుకు అనుగుణంగా ఉన్నాయన్నారు. 53 వేల ఫిల్లిండ్ స్టేషన్లలో ధరల మార్పు సులభతరమేనన్నారు. అయితే కేవలం కొన్ని పైసల తేడాతోనే ధరల మార్పులు చోటుచేసుకొంటాయన్నారు. కస్టమర్లకు ఎలాంటి షాక్ ను కంపెనీలు ఇవ్వబోవన్నారు.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







