అమెరికాలో ఇండియన్ ని చంపిన దుండగులు
- April 07, 2017
అమెరికాలో మరో ఘోరం. దోపిడీ దొంగల చేతిలో 26 ఏళ్ల భారతీయుడు దారుణ హత్యకు గురయ్యాడు. వాషింగ్టన్ రాష్ట్రంలోని యకిమా నగరంలో చోటుచేసుకున్న ఈ ఉదంతం వివరాల్లోకి వెళితే..
పంజాబ్‌కు చెందిన విక్రమ్ జర్యాల్.. నెలరోజుల క్రితమే అమెరికా వెళ్లాడు. ప్రస్తుతం యకిమా సిటీలోని ఏఎం–పీఎం గ్యాస్‌స్టేషన్‌లో క్లర్కుగా విధులు నిర్వర్తిస్తున్నాడు. గురువారం(స్థానిక కాలమానం ప్రకారం) మాస్కులు ధరించిన ఇద్దరు వ్యక్తులు విక్రమ్ పనిచేస్తోన్న స్టేషన్‌కు వచ్చి, డబ్బుకోసం బెదిరించారు. దీంతో విక్రమ్ స్టేషన్ కౌంటర్‌లో ఉన్న నగదును వారికి ఇచ్చాడు. అయినప్పటికీ ఆ ఇద్దరు దుండగుల్లో ఒకరు విక్రమ్‌పై కాల్పులు జరిపాడు. అనంతరం ఇద్దరూ పారిపోయారు.
ఇది జాత్యహంకార దాడే అయి ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. దుండగులు వెళ్లిపోయిన తర్వాత కొందరు విక్రమ్‌ను గుర్తించి, ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే అతను మృతిచెందినట్టు వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటన నేపథ్యంలో రంగంలోకి దిగిన పోలీసులు విచారణ చేపట్టారు.
ఖండించిన విదేశాంగ మంత్రి
ఈ ఘటనను విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ ఖండించారు. విక్రమ్ సోదరుడు ఈ ఘటనను తన ట్విటర్ ఖాతాద్వారా సుష్మ దృష్టికి తీసుకెళ్లారు. మృతదేహాన్ని వెనక్కి రప్పించేందుకు చేయూత ఇవ్వాలని కోరారు. కాగా విక్రమ్...పంజాబ్‌లోని హోషియార్‌పూర్ వాసి.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







