ప్రైవేటు విద్యపై ఒపీనియన్ పోల్
- September 29, 2015
ప్రైవేటు విద్యా సంస్థల్లో విద్యా ప్రమాణాలకు సంబంధించి ఒపీనియన్ పోల్ నిర్వహించేందుకు జాతీయ గణాంకాలు మరి సమాచార కేంద్రం సంసిద్ధమయ్యింది. మంగళవారం ఈ సర్వే మొదలవుతుంది వారం రోజులపాటు జరిగే ఈ సర్వేలో ఒమనియన్లు ఎందుకు ప్రైవేటు విద్యా సంస్థలవైపు మొగ్గు చూపుతున్నారు? నిబంధనల ప్రకారం విద్యా ప్రమాణాలు వున్నాయా? లేదా? అనే విషయాలపై స్పస్టత రానుంది. విద్యా సంస్థల్లో సౌకర్యాల మెరుగు వంటి అంశాలనూ ఈ సర్వే ద్వారా తెలుసుకోనున్నారు. స్కూళ్ళు, కాలేజీలు, విశ్వవిద్యాలయాలూ ఈ సర్వేలో భాగమవుతాయి. 1200 మంది తల్లిదండ్రులు (ప్రైవేటు స్కూల్స్‌కి సంబంధించి) ఈ సర్వేలో పాల్గొంటారు. అదే సంఖ్యలో ఉన్నత విద్య విషయంలోనూ సర్వే జరుగుతుంది. ఇ-మెయిల్, టెలిఫోన్ ద్వారా కూడా సర్వే నిర్వహిస్తారు. విద్యార్థుల తల్లిదండ్రుల వివరాల్ని విద్యా మంత్రిత్వ శాఖ తెలుసుకుంటుంది. 2013 లెక్కల ప్రకారం 1042 ప్రభుత్వ పాఠశాలలు, 468 ప్రైవేటు పాఠశాలలు వున్నాయి. ప్రభుత్వ కళాశాలలు, యూనివర్సిటీల సంఖ్య 26 కాగా, ప్రైవేటు రంగంలో ఇవి 27 వున్నాయి. ప్రైవేటు విద్యాసంస్థల్లో సౌకర్యాల మెరుగుకోసం తీసుకోవాల్సిన చర్యలు వంటివి ఈ సర్వే ద్వారా వెలుగులోకి రావొచ్చు. అలాగే, ప్రభుత్వ సంస్థల్ని ఇంకా బలోపేతం చేయడానికి ఈ సర్వే ఉపయోగపడుతుంది.
--నూనె లెనిన్ కుమార్(ఒమాన్)
తాజా వార్తలు
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్‌లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!







