ఈతకొలనులో బట్టలుకుతున్న కూలీల అరెస్ట్
- September 29, 2015
ఓ ఫామ్‌హౌస్‌లో గల స్విమ్మింగ్ పూల్‌లో బట్టలు ఉతుకుతున్న వలస కూలీల్ని అరెస్ట్ చేసినట్లు పబ్లిక్ అథారిటీ ఫర్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ వెల్లడించింది. ఓ లాండ్రీ కోసం ఆ కూలీలు స్విమ్మింగ్ పూల్‌లో బట్టలు ఉతుకుతున్నట్లు గుర్తించారు. దాంతో సదరు లాండ్రీని సైతం మూసివేశారు. సీబ్‌లో కన్స్యూమర్ ప్రొటెక్షన్ డిప్యూటీ డైరెక్టర్ జియాద్ అల్ వహాబీ చెబుతూ, కన్స్యూమర్ చట్టంలోని ఆర్టికల్ 3ని వలస కూలీలు ఉల్లంఘించరని అన్నారు. బట్టల్ని స్విమ్మింగ్ పూల్‌లో ఉతకడం ద్వారా స్విమ్మింగ్ పూల్‌ని వినియోగించేవారి ఆరోగ్యానికి హాని కలుగుతుందని చెప్పారు. దోఫార్లోనూ ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. ఓ వలస కూలీని అక్కడి పోలీసులు అరెస్ట్ చేశారు. లైసెన్స్ లేకుండా లాండ్రీ నడుపుతున్న నిర్వాహకులకు నోటీసులు జారీ చేశారు.
--నూనె లెనిన్ కుమార్(ఒమాన్)
తాజా వార్తలు
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్‌లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!
- షార్జాలో కాలేజీ అడ్మిషన్ పేరుతో Dh1.515 మిలియన్ల మోసం..!







