2016 కొత్త కార్మిక చట్టం-యూ.ఏ.ఈ
- September 29, 2015
కార్మిక చట్టంలో కొత్త మార్పుల్ని తీసుకు వస్తున్నారు. 2016 నుంచి అమల్లోకి వచ్చే ఈ కొత్త చట్టంలో మూడు ముఖ్యమైన నిబంధనల్ని పొందుపర్చారు. కార్మిక మంత్రిత్వ శాఖ ఈ వివరాల్ని వెల్లడించింది. కార్మికుల కోసం లేబర్ కాంట్రాక్ట్, ఉద్యోగులు మరియు కార్మికుల మధ్య ఒప్పందాల రద్దు, రెసిడెంట్ వర్కర్ కోసం కొత్త వర్క్ పర్మిట్ వంటివి ఇందులో పొందుపర్చారు. కార్మిక శాఖ మంత్రి సక్ర్ ఘోబాష్ సయీద్ ఘోబాష్ చెబుతూ ఈ మార్పులు కార్మికుడికి యజమానికి మధ్య సంబందాల్ని మెరుగుపర్చుతాయన్నారు. యజమానికీ, విదేశీ కార్మికుడికీ మధ్య స్పష్టమైన మరియు వివరణాత్మకమైన ఒప్పందానికి సంబంధించి మొదటి నిబంధనను చేర్చినట్లు తెలియవస్తుంది. రెండో నిబంధన ప్రకారం రెండేళ్ళ ఒప్పందం చేసుకునేటప్పుడు కార్మికుడ్ని ముందే తొలగించాలనుకుంటే నెల రోజుల ముందు నోటీసు ఇవ్వాల్సి ఉంటుంది. గడువు లోపు చెల్లింపులన్నీ కార్మికుడికి జరగాలి. మూడో నిబంధన, ఆరు నెలలు పనిచేసిన తర్వాత మాత్రమే యజమాని, కార్మికుడిని తొలగించడానికి వీలవుతుంది.
--సి.శ్రీ(దుబాయ్)
తాజా వార్తలు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!







