అబుదాబీలో అక్టోబర్ 1 నుంచి కొత్త వంట గ్యాస్ విధానం
- September 30, 2015
అడ్‌నాక్ పంపిణీ ఇక నుంచి నియంత్రిత పద్ధతిలో అమల్లోకి రానుంది. రహల్ ఇ-గ్యాస్ కార్డ్స్ ద్వారా వంట గ్యాస& సిలిండర్లను నెలవారీ కోటా పద్ధతిలో సరఫరా చేస్తుంది. అడ్‌నాక్ పంపిణీ వర్గాల సమాచారం ప్రకారం ఎమిరేట్ కుటుంబాలకు నెలవారీ 150 దిర్హామ్‌ల విలువ గల ఎల్పీజీ సిలండర్‌లను పొందే అవకాశం ఉంది. అలాగే ఒక్కో ఎమిరేట్ పౌరుడికీ 70 దిర్హామ్‌ల విలువైన గ్యాస్ సిలండర్ మాత్రమే పొందే వీలుంది. వలస కుటుంబాలు, వలస పౌరులకు 70, 40 దిర్హామ్‌లకే కార్డులను పరిమితం చేశారు. 50 దిర్హామ్ అదనపు ఫీజుతో రహల్ ఇ గ్యాస్ కార్డుల్ని అందజేస్తుంది. మొదటిసారి అప్లికేషన్ ఫీజ్ 200 దిర్హామ్ నుంచి 50 దిర్హామ్‌లను మినహాయిస్తారు. అడ్నాక్ డిస్ట్రిబ్యూషన్ సంస్థ సీఈఓ అబ్దుల్లా సలీమ్ అల్ దహేరీ మాట్లాడుతూ, అందరికీ వంట గ్యాస్ అందించాలనే ఉద్దేశ్యంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. సబ్సిడీ లేని సిలెండర్ల ధరల్ని సైతం సమీక్షించనున్నట్లు చెప్పారాయన. నగదు చెల్లింపు లేదా క్రెడిట్ కార్డ్స్ ద్వారా రహల్ ఇ కార్డ్స్ పొందవచ్చునట. ప్రపంచ వ్యాప్తంగా మారుతున్న ఇంధన ధరలకు అనుగుణంగా ప్రతి నెలా 10వ తేదీన సబ్సిడీ లేని సిలెండర్ల ధరల్ని సవరిస్తామని అడ్‌నాక్ సంస్థ వివరించింది.
--సి.శ్రీ(దుబాయ్)
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







