పవన్ కళ్యాణ్ మాటలకు కంట తడిపెట్టిన కోట శ్రీనివాసరావు

- April 09, 2017 , by Maagulf
పవన్ కళ్యాణ్ మాటలకు కంట తడిపెట్టిన కోట శ్రీనివాసరావు

విలక్షణ నటుడిగా కోట శ్రీనివాసరావుకు ఉన్న పేరు ఒక ఎత్తు అయితే ఏ విషయం గురించి అయినా ఎటువంటి మొహమాటం లేకుండా స్పష్టంగా మాట్లాడటం కోట నైజం. వందల కొద్దీ అద్భుతమైన పాత్రలతో తన అసాధారణ నట ప్రతిభతో మెప్పించిన కోట ఎవరినైనా విమర్శించాలి అన్నా ఎటువంటి మొహమాటాలు పెట్టుకోడు.
అదేవిధంగా ఎవరినైనా ప్రశంసించాలి అంటే కూడ ఎటువంటి భేషిజం లేకుండా ప్రశంసలు కురిపించే అలవాటు కోటశ్రీనివాస రావుకు ఉంది. అటువంటి వ్యక్తిత్వం ఉన్న ఈయన పవన్ కళ్యాణ్ తన గురించి మాట్లాడిన మాటలకు తన కంట కన్నీరు వచ్చిందని చెపుతున్నాడు.
ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కోట ఈ కామెంట్స్ చేసాడు. పవన్ 'అత్తారింటికి దారేది' సక్సస్ మీట్లో పవన్ చాలా ఎమోషనల్ గా మాట్లాడుతూ మధ్యలో తన గురించి మాట్లాడటం తనకు ఉద్వేగం కలిగించింది అని చెప్పాడు కోట.
దాదాపు యూనిట్ మొత్తం హాజరైన ఆ సినిమా ఫంక్షన్ భారీ ఎత్తున జరిగిన విషయాన్ని గుర్తుకు చేసుకుంటూ కోట పవన్ కళ్యాణ్ ప్రస్తావన తీసుకు వచ్చాడు.
ఆ ఫంక్షన్ లో పవన్ అందరి ఆర్టిస్టులందరి గురించి మాట్లాడి తన వరకు వచ్చే సరికి 'కోట గారు పెద్ద వారు. ఆయన గురించి నేనేం చెబుతాను? ఆయన గురించి మాట్లాడాలంటే నా వయసు కానీ, అనుభవం కానీ సరిపోవు' అన్నప్పుడు పవన్ సంస్కారానికి తన కంట కన్నీరు వచ్చిన విషయాన్ని గుర్తుకు చేసుకున్నాడు.
అంతేకాదు ఆ ఫంక్షన్ కు వచ్చిన జనం అంతా 'పవర్ స్టార్ పవర్ స్టార్' అని కేకలు పెడుతుంటే అంతటి క్రేజ్ ఉన్న నటుడు. తన గురించి రెండు మాటలు చెప్పి గౌరవించడం తనకు గొప్పగా అనిపించడమే కాకుండా పవన్ సంస్కారానికి తాను ఉద్వేగపడిన సందర్భాన్ని గుర్తుకు చేసుకున్నాడు కోట. అయితే ఎప్పుడో జరిగిపోయిన 'అత్తారింటికి దారేది' మూవీ ఫంక్షన్ ను కోట ఇప్పుడు గుర్తుకు తెచ్చుకుని మరీ చెప్పడం వెనుక తనను ప్రస్తుతం టాప్ హీరోలు పట్టించుకోవడం లేదు అన్న బాధ అంతర్లీనంగా కనిపిస్తోంది..

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com