స్ప్రౌట్స్ కిచిడీ
- April 09, 2017
కావలసిన పదార్ధాలు: మిక్స్డ్ స్ర్పౌట్స్ (పెసలు, శనగలు, సోయా)- ఒక కప్పు, నానబెట్టిన బియ్యం - ఒక కప్పు, వెన్న లేదా నెయ్యి - అర టీ స్పూన్, జీలకర్ర - పావు టీ స్పూన్, ఇంగువ - చిటికెడు, తరిగిన ఉల్లి తరుగు - రెండు టీ స్పూన్లు, వెల్లుల్లి ముద్ద - ఒక టీ స్పూన్, ఉప్పు - తగినంత, నీళ్ళు - తగినన్ని
తయారీ విధానం: కుక్కర్ స్టవ్ మీదపెట్టి, దాంట్లో నెయ్యి వేసి వేడిచేయాలి. జీలకర్ర వేసి చిటపటలాడగానే ఇంగువ, వెల్లుల్లి ముద్ద వేసి కలపాలి. సన్నని మంటమీద కొద్దిసేపు వేగనివ్వాలి. తరువాత ఉల్లి తరుగు వేసి రెండు నుంచి మూడు నిమిషాలసేపు వేయించాలి. దానికి బియ్యం, మొలకెత్తిన గింజలు కలిపి ఓ అరగంట సేపు ఉడికించాలి. తగినన్ని నీళ్ళు, ఉప్పు వేసి బాగా కలిపి కుక్కర్ మూతపెట్టాలి. మూడు విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసి మెత్తగా అయ్యేలా గరిటెతో కలపాలి. వేడిగా ఉన్నప్పుడే పెరుగుతో సర్వ్ చేస్తే కిచిడీ అదుర్స్.
తాజా వార్తలు
- ఢిల్లీలో CJP నేతలకు ఊరట..
- అల్ ఐన్ అంతర్జాతీయ విమానాశ్రయానికి కొత్త పేరు..
- సిరిసిల్ల JNTU ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థుల సమస్యలపై సీఎం రేవంత్ కి కేటీఆర్ విజ్ఞప్తి
- యూరప్‌లో వైద్య నిపుణుల శిక్షణకు తుంబే గ్రూప్–రొమేనియా యూనివర్సిటీ భాగస్వామ్యం
- ఒమాన్‌లో అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఆన్లైన్ విద్యపై అవగాహన కార్యక్రమం
- ఏపీలో మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్లు ఖరారు..
- రియాద్ విమానాశ్రయంలో అంతరాయం..అక్టోబర్ 12 వరకు ఎతిహాద్ విమానాలు రద్దు
- నోబెల్ విజేతలకు రూ.11.52 కోట్లు
- స్మిత్ మచ్చర్ కు ఇజ్రాయెల్ ప్రెసిడెంట్ లేఖ
- రియాద్ విమాన సర్వీసులు రద్దు చేసిన కువైట్ ఎయిర్వేస్..!!







