న్యూస్ ప్రజెంటర్స్ ఐసిస్ హిట్ లిస్టులో
- April 10, 2017
ఐఎస్ఐఎస్ హిట్ లిస్టులో ఇన్ని రోజులు ప్రముఖ నేతలు, ప్రముఖ కంపెనీల అధినేతలు, ప్రభుత్వాలకు సహకరించే వారు ఉండేవారు. కానీ తాజాగా న్యూస్ ప్రజెంటర్లను కూడా ఐసిస్ టార్గెట్ చేసింది. బీబీసీ, స్కై న్యూస్ లోని ప్రముఖ బ్రిటీష్ టెలివిజన్ జర్నలిస్టులను ఐసిస్ టార్గెట్ చేసినట్టు తెలిసింది. న్యూస్ రీడర్స్ పై అటాక్ చేయడంతో పాటు, వారి ఆఫీసు ప్రాంగణాల్లో కూడా దాడులు నిర్వహించేందుకు పన్నాగం పన్నుతుందని డైలీస్టార్ రిపోర్టు చేసింది. వారిని అలర్ట్ చేయాలని పోలీసులను తాము ఆశ్రయించామని, కౌంటర్ టెర్రరిజం అధికారులు ఈ కేసులను విచారణకు స్వీకరించినట్టు డైలీ స్టార్ పేర్కొంది.
బీబీసీ, స్కై న్యూ రీడర్లను టార్గెట్ చేసినట్టు ఇస్లామిక్ స్టేట్ వెబ్ సైట్లో పేర్కొన్నారని, వారి ఆఫీసు ప్రాంగణాలని కూడా వెబ్ సైట్లో పోస్టు చేసినట్టు న్యూస్ పేపర్ వివరించింది. పర్యాటక ప్రదేశ ప్రాంతాల్లో కూడా దాడులు నిర్వహించాలని టెర్రర్ బాసులు ఆదేశించినట్టు తెలిసింది. డౌనింగ్ స్ట్రీట్, బిగ్ బెన్, వెస్ట్ మిన్స్టర్ వంటి ప్రాంతాలు వారి టార్గెట్ గా ఉన్నాయట. ఐసిస్ పోస్టు చేసిన మిగతా జాబితాల్లో బ్రిటీష్ ఎంపీలు, పోలీసు స్టేషన్లు, ప్రభుత్వ భవంతులు, ఆర్మీ బేస్ లు, షాపింగ్ సెంటర్లు, ఎయిర్ పోర్టులు ఉన్నట్టు డైలీ స్టార్ రిపోర్ట్ చేసింది.
తాజా వార్తలు
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్‌కు అంతర్జాతీయ గుర్తింపు..!!
- సోషల్ మీడియా బ్యాన్.. క్రియేటర్ ఎకానమీపై ప్రభావంపై యూఏఈ క్లారిటీ..!!







