సాయం కోసం భారతీయ వలసదారుడి ఎదురుచూపు
- April 10, 2017
32 ఏళ్ళుగా బహ్రెయిన్‌లో ఉంటోన్న భారతీయ వలసదారుడొకరు సాయం కోసం ఎదురుచూస్తున్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన తనకు ఎవరైనా సాయం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న 62 ఏళ్ళ అలౌసియాస్, ఇండియాకి తిరిగి వెళ్లాలనుకుంటున్నాననీ, అయితే ఇక్కడ తనకు కొన్ని అప్పులు ఉన్నాయని అంటున్నారు. భారతదేశంలో ఉన్న తన కుటుంబానికి మెరుగైన జీవనం అందించడం కోసం మూడు దశాబ్దాల క్రితం బహ్రెయిన్‌కి వచ్చాననీ, మొదట్లో కన్స్ట్రక్షన్ బిజినెస్ చేసిన తనకు అంతా బాగానే ఉందనీ అయితే అనుకోని కారణాలతో బిజినెస్ డల్ అవడంతో ఆర్థికంగా చితికిపోయాననీ, అనారోగ్యంతో బతుకునీడ్చలేకపోతున్నానని, ఏ పనీ చేయలేకపోతున్నానని ఆవేదన వ్యక్తం చేశారాయన. ట్రావెల్ బ్యాన్ నుంచి తప్పించుకోడానికి 3400 బహ్రెయినీ దినార్స్ తాను చెల్లించవలసి ఉందని ఆయన అంటున్నారు. ఇంకో వైపున ఇండియన్ కమ్యూనిటీ మెంబర్స్ నుంచి ఆయన దీనగాధకు స్పందన వచ్చిందని ఇప్పటివరకు 600 బహ్రెయినీ దినార్స్ సేకరించామని, మొత్తం సొమ్ముని సేకరించి, ఆయన్ని ఆదుకుంటామని ఐసిఆర్‌ఎఫ్ వలంటీర్ సయ్యద్ హనీఫ్ చెప్పారు. బాధితుడు ప్రస్తుతం ఆహారం సైతం సేకరించుకోలేని ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారు.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







