25 ఫిషర్‌మెన్‌లను నిర్బంధించిన ఇరాన్
- April 10, 2017
25 మంది భారతీయ ఫిషర్‌మెన్‌ని ఇరాన్ నిర్బంధించింది. తమ దేశ టెరిటోరియల్ వాటర్స్ నిబంధనల్ని ఉల్లంఘించిన కారణంగా వీరిని అదుపులోకి తీసుకున్నారు. వీరంతా ఇండియాలోని కన్యాకుమారికి చెందినవారు. మార్చి 8న బయల్దేరిన ఓ బృందం మార్చి 12న ఇరాన్ నిర్బంధంలోకి వెళ్ళింది. మరో బృందం మార్చి 22న బయల్దేరి వెళ్ళగా ఆ మరుసటి రోజే వారినీ అదుపులోకి తీసుకున్నారు. అరెస్టు చేసినవారిని కిష్ ఐలాండ్‌లో ఉంచారని ఇంటర్నేషనల్ ఫిషర్‌మెన్ డెవలప్‌మెంట్ ట్రస్ట్ ఇన్ఫిడెట్ ఫౌండర్ ప్రెసిడెంట్ జస్టిన్ ఆంటోనీ చెప్పారు. ఇరానియన్ లాంగ్వేజ్‌లో ఉన్న కొన్ని పత్రాలపై ఫిషర్‌మెన్‌తో అక్కడి అధికారులు సంతకాలు చేయించుకున్నట్లు ఆయన తెలిపారు. బాధిత ఫిషర్‌మెన్ విషయంలో వారి స్పాన్సరర్స్ ఇంతవరకు స్పందించలేదని చెప్పారాయన. అయితే ఓ బోటుకు చెందిన స్పాన్సరర్ మొహమ్మద్ హసన్ మాట్లాడుతూ, ఫిషర్‌మెన్ ఇరాన్ టెరిటోరియల్ వాటర్స్‌లోకి అడుగు పెట్టలేదని చెప్పారు. జెగన్, జెనిష్, జోస్ ప్రిన్స్, అరోకియా జాన్ యుఫుర్, జేసుదాసన్, అరోకియా ఎబెస్ బోర్గియో, బాస్కాలిస్, ఆంటోనీ పిచాయ్, ఆంటోనీ సూసాయ్, ఆంటోనీ ప్రమోద్, బోర్జియో ఫ్రాన్సిస్, విక్టర్, విసువాసమ్, ఆరోకియా బెర్విన్ బెస్కి, అరుల్ వివేక్, అరుణ్ ప్రాజిదాన్, సాజన్, సావియో, విలియమ్ ప్రభు, జోసెప్ బెస్కీ, డోమినిక్ సావియో, నిసాంత్, మెరిన్ కుమార్, రాజ్ తిలక్, అన్సన్ తదితరులు అరెస్టయినవారిలో ఉన్నారు.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







