3 మిలియన్ల రియాళ్ళ నోట్ల కట్టలను అక్రమరవాణా చేస్తున్న లారీ డ్రైవర్ అరెస్ట్

- April 10, 2017 , by Maagulf
3 మిలియన్ల రియాళ్ళ నోట్ల కట్టలను  అక్రమరవాణా చేస్తున్న లారీ డ్రైవర్ అరెస్ట్

సాధారణంగా ఇసుకో..ఇటుకో లేదా నిత్యావసరాల వస్తువులనో  తరలించే లారీలో అందుకు విభిన్నంగా భారీగా నోట్లకట్టలు పేర్చుకొని హుషారుగా అక్రమ రవాణా చేస్తున్న ఓ లారీ డ్రైవర్ ను సంబంధిత అధికారులు అడ్డుకొన్నారు. మూడు మిలియన్లకు పైగా సౌదీ రియల్స్ డబ్బును యుఎఇ లోకి అక్రమంగా తీసుకువస్తున్న ఆ లారీ డ్రైవర్ ను పట్టుకొని కస్టమ్స్ అధికారులు అరెస్టు చేశారు. అబుదాబి సాధారణ పరిపాలన కస్టమ్స్ శాఖ అధికారులు ఆదివారం మాట్లాడుతూ,అబూధాబీ లో ఘువైఫేట్ సరిహద్దు వద్ద ఆ ఆసియా డ్రైవర్ ను పట్టుకున్నట్లు తెలిపారు.ఆ వ్యక్తి  సౌదీ అరేబియా దాటి  యుఎఇ లోనికి ప్రవేశించాలని ప్రయత్నించినట్లు తెలిపారు. తనిఖీ అధికారులు లారీని క్షుణ్ణంగా వెతకగా డ్రైవర్ సీటు వెనుక ఒక రహస్య అరలో 3.750.000  రియాళ్ళ నగదు పెద్ద మొత్తంలో దొరికింది. డ్రైవర్ అధికారులకు ఆ నగదు గూర్చి ఎటువంటి సమాచారం ఇవ్వలేదు. ఆ లారీ డ్రైవర్ పై చట్టపరమైన చర్య తీసుకొనేందుకు ఉన్నతాధికారులకు సూచించబడింది మరియు కోర్టు తగిన నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది. చట్ట ప్రకారం,యుఎఇ వెళ్ళేటప్పుడు..లేదా ప్రవేశించేటప్పుడు సందర్శకులు డబ్బు పెద్ద మొత్తంలో తీసుకువస్తున్నప్పుడు వాటిని ముందుగా నిర్ధారించుకోవాల్సి ఉంది. అంత భారీ నగదు బదిలీ చేయడానికి లక్ష్యం ఏమిటో అధికారులకు వివరించాల్సి ఉంది.అబూధాబీ లో కస్టమ్స్ డైరెక్టర్ జనరల్ మహమ్మద్ అల్ హమ్మలి ఈ సందర్భంగా మాట్లాడుతూ, జనరల్ అడ్మినిస్ట్రేషన్ అబుదాబి కస్టమ్స్ అభివృద్ధి మరియు తాజా తనిఖీ విధాన వ్యవస్థలు సంబంధిత ప్రభుత్వ విభాగాల సహకారంతో  పని చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com