ఏపీ, తెలంగాణ తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర వడగాలులు
- April 10, 2017
మధ్య భారతావనిలో కొనసాగుతున్న ఉష్ణగాలుల ప్రభావంతో రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఉష్ణోగ్రతలు ఠారెత్తిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 43 డిగ్రీలకు చేరుకున్నాయి. మధ్యప్రదేశ్, మరాట్వాడ, తెలంగాణ, కోస్తాంధ్రలోని కొన్ని ప్రాంతాలు, రాయలసీమ జిల్లాల్లో తీవ్రస్థాయి ఉష్ణగాలుల ప్రభావం కొనసాగుతోందని భారత వాతావరణ విభాగం హెచ్చరించింది. మరో రెండు, మూడు రోజుల పాటు వడగాల్పుల పరిస్థితి కొనసాగే అవకాశముంది. ప్రస్తుతం ఈ రెండు రాష్ట్రాల్లోనూ సగటు ఉష్ణోగ్రతలు 3-5 డిగ్రీల మేర పెరిగాయని వాతావరణ శాఖ వెల్లడించింది. .
ఆంధ్రప్రదేశ్‌లోని కడప, కర్నూలు నగరాల్లో సోమవారం అత్యధికంగా 43 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.
అనంతపురం జిల్లాలో 42, నంద్యాల, తిరుపతిలో 41 డిగ్రీలు, జంగమహేశ్వరరంలో 40 డిగ్రీలు, నందిగామలో 39, విశాఖపట్నం, తుని, కావలి, కాకినాడలో 36, మచిలీపట్నం, ఒంగోలులో 35, నర్సాపురం, కళింగపట్నంలో 34 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.
తెలంగాణలోని ఆదిలాబాద్, నిజామాబాద్, రామగుండం, మెదక్‌లో అత్యధికంగా 42 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. భద్రాచలం, మహబూబ్‌నగర్‌లో 41, హన్మకొండ, హైదరాబాద్, ఖమ్మం, నల్గొండలో 40, హకీంపేటలో 39 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మరోవైపు రాత్రిపూట ఉష్ణోగ్రతలు కూడా క్రమంగా పెరుగుతున్నాయి.
తాజా వార్తలు
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!







