ధీం-తానా :ప్రవాస తెలుగువారి టాలెంట్‌ను వెలికితీసే కార్యక్రమం
- April 12, 2017
సేవ, సంస్కృతి, సమైక్యత.. ఇదే నినాదంతో, ఇదే లక్ష్యంతో పనిచేస్తున్న తానా.. 40ఏళ్ల ఘన ప్రస్థానాన్ని.. మరింత ఘనంగా జరుపుకుంటోంది. దీనిలో భాగంగా ధీం-తానా కాంపిటీషన్స్ నిర్వహిస్తోంది. ప్రవాస తెలుగువారి టాలెంట్ ను వెలికితీసే ఈ కార్యక్రమం.. వారికి అంతే వినోదాన్ని, ఆనందాన్ని పంచుతోంది.. ఈ కార్యక్రమానికి అంకురార్పణ చారిత్రాత్మక కొలంబస్ నగరంలో జరిగింది. కొలంబస్.. ఒహియో స్టేట్ క్యాపిటల్ తో పాటు రాష్ట్రంలో పెద్ద నగరం కూడా ఇదే. 1812లో ఈ ప్రాంతాన్ని క్రిస్టఫర్ కొలంబస్ కనుగొనడంతో ఈ నగరానికి ఆయనే పేరే స్థిరపడిపోయింది. ఎడ్యుకేషన్, ఇన్సూరెన్స్, బ్యాంకింగ్, ఫ్యాషన్, డిఫెన్స్, ఏవియేషన్, ఫుడ్, స్ట్రీల్, రిటైల్, టెక్నాలజీ రంగాలకు కొలంబస్ పెట్టింది పేరు. ది ఒహియో స్టేట్ యూనివర్సిటీతో పాటు ప్రపంచంలోనే అతిపెద్ద కెమికల్ ఎబ్స్ ట్రాక్ట్స్ సర్వీసెస్, జెట్ ఎయిర్ క్రాఫ్ట్ ప్లీట్ సహా అనేక ప్రత్యేకతలు ఉన్న ఈ గొప్పనగరంలో.. ధీం-తానా-2017 కాంపిటీషన్స్ ప్రారంభమయ్యాయి. తానా 40ఏళ్ల ఘన ప్రస్థానాన్ని పురస్కరించుకుని నిర్వహించిన ఈ కాంపిటీషన్స్.. తానా-టీవీ5 ఆధ్వర్యంలో జరిగాయి. దీపారాధనతో ప్రారంభమైన కొలంబస్ ధీం-తానా కాంపిటీషన్స్.. క్లాసికల్ జూనియర్ విభాగంతో మొదలయ్యాయి. ఈ విభాగంలో చిన్నారులు ఆలపించిన క్లాసికల్ సాంగ్స్, డ్యాన్స్ లు అందరినీ కట్టిపడేశాయి. క్లాసికల్ సింగింగ్ విభాగానికి ఆ రంగంలో నిష్ఠాతులైన ఐదుగురు జడ్జెస్ గా వ్యవహరించారు. రాజేశ్వరి గోపాల్, శ్రీరామ్ శఠగోపన్, అనుష్ శాండిల్య గణేశ్, జయంతి సింగ్, దూర్జటి ముదిగొండలు న్యాయనిర్ణేతలుగా వ్యవహరించి.. చిన్నారి విజేతలను ఎంపిక చేశారు. ఈ సందర్భంగా ధీం-తానా బృదం జడ్జెస్ ను మెమెంటోస్‌తో సత్కరించింది. క్లాసికల్ జూనియర్ విభాగం అనంతరం.. మ్యాథ్స్ బీ కాంపిటీషన్స్ లో పాల్గొన్న చిన్నారులకు ధీం-తానా సర్టిఫికెట్స్ అందజేశారు.. కొలంబస్ ధీం-తానా కాంపిటీషన్స్ లో క్లాసికల్, సింగింగ్ కాంపిటీన్స్ తో పాటు డ్యాన్స్, ఫ్యాషన్ షో పోటీలూ అదరగొట్టాయి. చిన్నారులతో పాటు యూత్ పార్టిస్పెంట్స్ వేసిన స్టెప్ లు, అందగత్తెల హొయలు అందరినీ ఉర్రూతలూగించాయి.. డ్యాన్స్ కాంపిటీషన్స్ తర్వాత జరిగిన ఫ్యాషన్ షో అందరినీ కట్టిపడేసింది. మిస్ తానా, మిస్సెస్ తానా కిరాటాల కోసం.. బ్యూటిఫుల్ పార్టిస్పెంట్స్ హోరాహోరీగా పోటీపడ్డారు. ర్యాంప్ వాక్ లతో అలరించారు.. అనంతరం తానా సభ్యులందరినీ సన్మానించారు. కొలంబస్ ధీం-తానా ఈవెంట్ ఆర్గనైజర్లను మెమొంటోలతో సత్కరించారు.
తాజా వార్తలు
- షార్లెట్‌లో NATS ఆధ్వరంలో మహిళా దినోత్సవ వేడుకలు
- తెలంగాణ మహిళా కాంగ్రెస్ నూతన అధ్యక్షురాలిగా ఎర్రబెల్లి స్వర్ణ
- టీవీ న్యూస్ ఛానళ్లకు కేంద్రం షాక్..
- ఏపీలో చిన్న పిల్లలకు సోషల్ మీడియా నిషేధం
- అమెజాన్ లో ‘ఎలక్ట్రానిక్స్ ప్రీమియర్ లీగ్’ ..ఆఫర్స్
- 'పిరికిపంద చర్య'గా ఉగ్రదాడి వర్ణన.. ఐక్యతకు పిలుపు!
- జీతం, సెలవులు మరియు మీ హక్కుల పై యూఏఈ లేబర్ లా ఏం చెబుతోంది?
- యూఏఈ సూపర్ మార్కెట్లలో పుష్కలంగా నిల్వలు..
- రంగంలోకి ఫుజైరా క్రౌన్ ప్రిన్స్
- DXB, DWC లో 48 గంటల్లో 1,140 ఫ్లైట్స్..!!









