టమోటా పాప్‌కార్న్ సూప్
- April 12, 2017
కావలసిన పదార్థాలు : టమోటాలు- ఒక నాలుగు (చిన్నవి), అమెరికన్ కార్న్(ఉడికించినది)-ఒకటి, వేగించిన పాప్‌కార్న్- అర కప్పు, మంచినీళ్లు-నాలుగు కపలు, పాల క్రీమ్-ఒక టేబుల్ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ అర టీ స్పూన్, పాలు-అరకప్పు, కార్న్‌ఫ్లోర్-ఒక టీస్పూన్, దాల్చిన చెక్క-చిన్న ముక్క, లవంగాలు-రెండు, టమాటా సాస్-ఒక టేబుల్‌స్పూన్, బటర్-ఒక టేబుల్ స్పూన్, మిరియాల పొడి-ఒక టీస్పూన్, కొత్తిమీర-ఒక టీస్పూన్, ఉప్పు-తగినంత.
తయారు చేసే విధానం : ముందుగా టమోటాలను నూనెలో వేయించి రోస్ట్ చేసుకోవాలి. ఒక గిన్నెను స్టవ్‌పై ఉంచి, నీళ్లు పోసి అందులో ఉప్పు వేయాలి. మరో బాణలి స్టవ్‌పై ఉంచి అందులో కొద్దిగా బటర్ వేసి అది వేడెక్కాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేగించి, వేయించిన టమోటా సూప్ కలపాలి. తర్వాత కొద్దిగా నీరు కలపాలి. దాల్చిన చెక్క, లవంగాలు కూడా వేసి పది నిమిషాల పాటు ఉడికించాలి. తరువాత చల్లని పాలలో కార్న్‌ఫ్లోర్ కలిపి ఆ మిశ్రమాన్ని ఉడుకుతున్న నీటిలో కలిపి, కాసేపయ్యాక వేగించిన పాప్‌కార్న్ కూడా వేసి సూప్ కొద్దిగా చిక్కబడ్డాక దించేయాలి. చివర్లో మిరియాల పొడి, పాల క్రీమ్, కొత్తిమీర చల్లి వేడి వేడిగా సర్వ్ చేయాలి.
తాజా వార్తలు
- రియాద్‌లో మళ్లీ క్షిపణి దాడి.. శకలాలు పడి ప్రవాసికి గాయాలు
- నెట్‌ఫ్లిక్స్‌లో భారీ లేఆఫ్స్.. ఉద్యోగులకు షాక్!
- తెలంగాణ పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు.. పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- పవన్ కల్యాణ్ సమక్షంలో జనసేనలోకి వంగవీటి రాధా
- అరుదైన కొండచిలువల అక్రమ రవాణా భగ్నం..!!
- సౌదీ అరేబియాలో బార్బర్ షాపులకు కొత్త నిబంధనలు..!!
- ఢిల్లీ పోలీసుల పై రాహుల్ గాంధీ ఆగ్రహం
- బహ్రెయిన్ లో ట్రాఫిక్ సేవల ఫీజు మినహాయింపు ప్రతిపాదన తిరస్కరణ..!!
- స్కూల్ గోడపై రాతలు.. వ్యక్తి అరెస్ట్..!!
- అల్ కరానా ప్రాంతంలో అత్యధిక వర్షపాతం..!!







