మెక్సికోలో ఘోరం: విమానం నుంచి మనషులను తోసేశారు
- April 13, 2017
మెక్సికోలో దారుణ ఘటన చోటు చేసుకుంది. విమానం నుంచి కొందరు వ్యక్తులను తోసేశారు. దీంతో ఓ వ్యక్తి ఓ హాస్పిటల్ అంతస్థుపై పడిపోయాడు. మరి కొద్ది దూరంలోనే మరో రెండు మృతదేహాలు లభ్యమయ్యాయి. ఈ ఘటన స్థానికంగా సంలచనలంగా మారింది.
వివరాల్లోకి వెళితే.. మెక్సికో ఉత్తరాన ఉన్న సినాలోవా ప్రాంతంలోని ఐఎంఎస్ఎస్ హాస్పిటల్ మిద్దెపై ఓ వ్యక్తి మృతదేహం లభ్యమైంది. బుధవారం ఉదయం 7.30 గంటల సమయంలో హాస్పిటల్‌పై నుంచి ఓ విమానం వెళుతోందని అప్పుడే ఓ వ్యక్తిని కిందపడినట్లు ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు. కానీ దీనిపై అధికారులు సరైన వివరణ ఇవ్వలేదు.
కులియాకన్ ప్రాంతానికి 60 కిమీల దూరంలో మరో రెండు మృతదేహాలు లభ్యమయ్యాయని వాటిని కూడా విమానం నుంచే తోసేసుంటారని భావిస్తున్నారు. మృతదేహాలు లభ్యమైన ప్రాంతాల్లో పొలాలు ఎక్కువగా ఉంటాయని ఇక్కడ ఫ్యుమిగేషన్ కోసం విమానాలు తరచూ తిరుగుతూ ఉంటాయని స్థానికులు చెబుతున్నారు.
కాగా, కిందపడేసిన వారిని బతికుండగా విమానం నుంచి తోసేశారా? లేక చంపేశాక విసిరేశారా? అనేది తెలియాల్సి ఉంది. ఈ ఘటనలపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటనలతో స్థానికుల్లో ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







