కష్టాల్లో సినీ నటి భూమిక
- April 15, 2017
పవన్ కళ్యాణ్ సూపర్ హిట్ మూవీ ' ఖుషీ ' హీరోయిన్ భూమికకి అప్పట్లో విపరీతమైన యూత్ ఫాలోయింగ్ వుండేది. చిరంజీవి, వెంకటేష్ , నాగార్జున తో హీరోయిన్ గా చేసింది భూమిక. అలాగే తారక్ - రాజమౌళి కాంబోలో వచ్చిన సూపర్ హిట్ ' సింహాద్రి ' మూవీలో కూడా లీడ్ రోల్ చేసిన భూమిక యొగా గురు భరత్ లవ్ మ్యారేజ్ చేసుకొంది. పెళ్ళి తరువాత ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేసిన భూమికకి లాస్ రావడంతో అది మూతపడింది. తరువాత ప్రేమించి పెళ్ళాడిన భర్తతో విభేదాలు వచ్చి విడాకులు తీసుకుంది.
అయితే విడాకుల తరువాత ఫైనాన్షియల్ గా భూమికకి కష్టాలు మొదలయ్యాయి అనే టాక్ వచ్చింది. అందుకే మళ్ళీ మేకప్ వేసుకోవడాని రెడీ అయ్యింది. ఆ మధ్య బాలీవుడ్ మూవీ ధోనీలో హీరోకి అక్కగా చేసిన భూమిక తనని ఎంతగానో ఆదరించిన టాలీవుడ్ లో కూడా ఆఫర్ల కోసం ప్రయత్నిస్తోందట. అలా నాని న్యూ మూవీలో అక్కగా చేస్తోందట. బాలీవుడ్ మూవీ ధోనీలో అక్కగా చేసినా అక్కడ పెద్దగా కలసి రాని భూమికకి నానితో చేస్తున్న మూవీ అయినా సక్సెస్ ఇస్తుందో లేదో.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







