రోడ్డు ప్రమాదానికి గురైన కారు దగ్ధం
- April 15, 2017
ఉమ్ అల్ కువైన్: రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటనలో కారులో మంటలు చెలరేగి, కారు పూర్తిగా దగ్ధమైపోయింది. ఉదయం 9.40 నిమిషాల సమయంలో ఉమ్ అల్ కువైన్ సివిల్ డిఫెన్స్ ఆపరేషన్ రూమ్, ప్రమాదానికి సంబంధించిన సమాచారం అందుకుంది. రెండు వాహనాలు ఢీ కొనడంతో ప్రమాదం జరగగా, అందులో ఓ కారుకి మంటలు అంటుకున్నాయి. ఫైర్ ఫైటర్స్ అలాగే పారామెడిక్స్ యాక్సిడెంట్ జరిగిన ప్రాంతానికి చేరుకుని మంటల్ని ఆర్పేశారు. అలాగే గాయాల పాలైన వ్యక్తికి ప్రాథమిక సమాచారం అందించారు. అనంతరం అతన్ని ఖలీఫా ఆసుపత్రికి తరలించారు. వాహనదారులు రోడ్లపై ట్రాఫిక్ రూల్స్‌ని పాటించాలని ఉమ్ అల్ కువైన్ సివిల్ డిఫెన్స్ కల్నల్ హస్సామ్ అలి మొహమ్మద్ బిన్ సుర్మ్ చెప్పారు.
తాజా వార్తలు
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- UAE participates in 12th GCC Labour Minister’s Committee meeting in Bahrain
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!
- గుల్మార్గ్లో ఎంపీ బాలశౌరి నేతృత్వంలో కమిటీ సమావేశం







