చికెన్‌లో కొకైన్
- April 15, 2017
సౌదీ అథారిటీస్, కొకైన్ షిప్మెంట్ని వ్యూహాత్మకంగా అడ్డుకున్నాయి. కింగ్డమ్కి చెందిన వెస్ట్ కోస్ట్ ద్వారా కొకైన్ అక్రమ రవాణా జరుగుతుందన్న విషయమై సమాచారం అందడంతో, తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా కస్టమ్స్ అధికారులు 46 కిలోల కొకైన్‌ని కింగ్ అబ్దుల్లా సీపోర్ట్ - రబిగ్లో పట్టుకున్నారు. ఫ్రోజెన్ చికెన్‌లో డ్రగ్స్‌ని దాచి, స్మగ్లర్స్ దాన్ని తరలించేందుకు ప్రయత్నించారు. అధికారులు చాకచక్యంగా వ్యవహరించి కొకైన్ స్మగ్లింగ్‌ని అరికట్టగలిగారు. ఫిబ్రవరిలో సౌదీ మెరైన్ బోర్డర్ గార్డ్స్, రెడ్ సీ కోస్ట్‌పై ఓ బోట్‌ని ఆపి, కింగ్‌డమ్‌లోకి అక్రమంగా తరలి వస్తున్న కొకైన్‌ని అడ్డుకున్నారు. 400 కిలోల హాషిస్, 100,000 ఆంఫిటమైన్ పిల్స్‌ని స్వాధీనం చేసుకోవడంతోపాటు ఈ ఘటనలో యెమెనీ స్మగ్లర్స్నీ అరెస్ట్ చేశారు.
తాజా వార్తలు
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!







