'మా' సభ్యులకు ఉచితంగా హెల్త్ క్యాంప్
- April 16, 2017
ప్రపంచ కాలేయ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం ఉదయం మూవీ ఆర్టిస్టు అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉచిత లివర్ స్కానింగ్ క్యాంప్ కార్యక్రమం జరిగింది. ప్రముఖ డాక్టర్ డి.చంద్రశేకర్‌రెడ్డి గ్యాస్టో ఎన్టరాలజిస్టు సమక్షంలో ఉచితంగా లివర్ పరీక్ష ‘మా’ సభ్యులకు చేశారు. ఈ సందర్భంగా మూవీ ఆర్టిస్టు అసోసియేషన్ అధ్యక్షులు శివాజీ రాజా మాట్లాడుతూ.. ‘మా’ ప్రతీ సభ్యులు ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ మెడికల్ క్యాంప్‌ని ఏర్పాటు చేయడం జరిగింది. హెల్త్ విషయంలో ఏ సభ్యుడికి ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. ఈరోజు ఏ చిన్న టెస్ట్ చేయించాలనుకున్నా ఎంతో ఖర్చుతో కూడుకున్నదైంది. అందుకోసమే ‘మా’ సభ్యుల కోసం ఉచితంగా ఈ హెల్త్ క్యాంప్‌లను నిర్వహించడం జరిగింది. ప్రతీ నెల రెండో ఆదివారం ఉచితంగా హెల్త్ క్యాంప్‌లను నిర్వహించడం జరుగుతుంది. ‘మా’ సభ్యుల ఆరోగ్యం మా ప్రధానాంశం. అందుకోసమే ఎప్పుడు ఆరోగ్యానికి సంబంధించి ఏ ఇబ్బంది వచ్చినా వెంటనే టెస్ట్‌లు ఉచితంగా చేయించుకోవడానికి ‘మా’ తరుపున డా.కె.వెంకటేశ్వరరావు (కె.వి.ఆర్)గారు అందుబాటులో ఉంటారు. అంతేకాకుండా ఈ హెల్త్ క్యాంప్‌కు సంబంధించి రెండు లక్షల భీమా సౌకర్యం కూడా ‘మా’ సభ్యులకు ఉందనే విషయాన్ని తెలియజేస్తున్నాను అన్నారు.
తాజా వార్తలు
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు
- దుబాయ్‌లో డ్రైవర్‌లెస్ ఎలక్ట్రిక్ పాడ్స్ టెస్ట్.. గంటకు 20 వేల మందికి ప్రయాణ సౌకర్యం!
- ఇంద్రకీలాద్రి పై మొదలైన దసరా ఉత్సవాలు..
- ఢిల్లీలో CJP నేతలకు ఊరట..
- అల్ ఐన్ అంతర్జాతీయ విమానాశ్రయానికి కొత్త పేరు..







