మెట్రో స్టేషన్లో బ్లూఫిలిం..
- April 16, 2017
అది రైల్వే స్టేషన్. అడ్వర్టయిజ్ మెంట్లు కనిపించాల్సిన చోట బ్లూ ఫిలిం కనిపిస్తే. కలకలం చెలరేగదా. ఢిల్లీలో అదే జరిగింది. రాజీవ్ చౌక్ మెట్రో స్టేషన్‌లోని LED డిస్ ప్లే బోర్డుపై హటాత్తుగా బ్లూ ఫిలిం సీన్లు ప్రత్యక్షమయ్యాయి. అదే కొన్ని క్షణాలు కాదు. దాదాపు 10 నిమిషాల పాటు ఆ సీన్ కనిపించింది. అంతే, జనం బిత్తరపోయారు. ఒక్కసారిగా కలకలం చెలరేగింది.
మెట్రో రైలు ఎక్కడానికి హడావుడిగా జనంలో ఒక్కసారిగా కలకలం. పట్టపగలు రైల్వే స్టేషన్లోనే అశ్లీలమైన సీన్లు కనిపించే సరికి కొందరు తమ మొబైల్ ఫోన్లకు పనిచెప్పారు. స్టేషన్లో హడావుడిని కెమెరాల్లో బంధించారు. చాలా ఆలస్యంగా మేలుకున్న అధికారులు చివరకు ఆ LED తెరను ఆఫ్ చేశారు.
ఈ ఘటనపై మెట్రో అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే ఆ LED స్క్రీన్ అంత సురక్షితమైంది కాదని పోలీసులు చెప్తున్నారు. మొబైల్ ఫోన్ ద్వారా ఎవరైనా దాన్ని ఆపరేట్ చేయవచ్చట. సీసీటీవీ ఫుటేజిని పరిశీలించిన పోలీసులు, ముగ్గురు యువకులను అనుమానితులుగా గుర్తించారు. వాళ్లే తమ సెల్ ఫోన్ ద్వారా ఈ నిర్వాకానికి పాల్పడి ఉంటారని భావిస్తున్నారు. వారి కోసం గాలింపు ముమ్మరం చేశారు. ఇప్పుడు ఢిల్లీలో ఓ ప్రశ్న తలెత్తింది. రైల్వేస్టేషన్లలోని LED స్క్రీన్లను ఎవరు పడితే వారు ఆపరేట్ చేయగలిగితే ఎలా. ఇలాంటి సీన్లు మళ్లీ రిపీట్ అయితే జనం పరిస్థితి ఏమిటి. హటాత్తుగా ఇలాంటి పరిణామం ఎదురైతే మహిళలు పిల్లల పరిస్థితి ఏమిటని ఢిల్లీ వాసులు ప్రశ్నిస్తున్నారు. ఇక ముందు ఇలా జరగకుండా డిజిటల్ సెక్యూరిటీ పటిష్టం చేస్తామంటున్నారు ఢిల్లీ మెట్రో అధికారులు.
తాజా వార్తలు
- చెన్నై పై గుజరాత్ ఘన విజయం
- కరీంనగర్ లో ఘనంగా కుబేర క్లాత్ షోరూం రెండో బ్రాంచ్ ప్రారంభం
- కువైట్‌లో ఎన్నారై టిడిపి ఆధ్వర్యంలో క్యాన్సర్ బాధిత కార్యకర్తకు ఆర్థిక సహాయం
- ప్రముఖ భారతీయ వ్యాపారవేత్త వాసు ష్రాఫ్ కన్నుమూత
- 2025లో QR 20.98 బిలియన్ల ‘రియల్’ లావాదేవీలు..!!
- వాట్సాప్ ద్వారా డాక్యుమెంట్స్..యూఏఈలో నిషేధం..!!
- ఎయిర్ పోర్టుల భద్రతకు సమగ్ర ప్రణాళిక అమలు..!!
- బహ్రెయిన్‌లో మొట్టమొదటి వర్చువల్ హార్స్ వేలం..!!
- వారంలో 1,077 స్మగ్లింగ్ కేసులు నమోదు: సౌదీ కస్టమ్స్
- సుల్తాన్ తో ఇరాన్ విదేశాంగ మంత్రి భేటీ..!!









