'తానా' ఆధ్వర్యంలో జరిగిన ధీం తానా కాంపిటీషన్స్

- April 16, 2017 , by Maagulf
'తానా' ఆధ్వర్యంలో జరిగిన ధీం తానా కాంపిటీషన్స్

ఎల్లలు లేని తెలుగు.. ఎప్పటికీ వెలుగు అంటూ.. తెలుగువారి ఖ్యాతిని, గొప్పతనాన్ని అమెరికా గడ్డపై చాటుతున్న తానా.. దిగ్విజయంగా 40ఏళ్లు పూర్తిచేసుకుంది. ఈ సందర్భంగా చార్లెట్ లో నిర్వహించిన ధీం-తానా కాంపిటీషన్స్ కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. పర్యాటకంగా ఎంతో ప్రాచుర్యం ఉన్న చార్లెట్ లో.. సింగింగ్, డ్యాన్స్ పోటీలతో పాటు మిస్ తానా, మిస్సెస్ తానా కాంపిటీషన్స్ కలర్ ఫుల్ గా సాగాయి. 

నార్త్ కరోలినా రాష్ట్రంలోని అతిపెద్ద నగరం చార్లెట్. ఈ నగరాన్ని క్వీన్ సిటీగా పిలుస్తారు. అమెరికాలోని ఫాస్టెస్ట్ డెవలపింగ్ సిటీస్‌లో చార్లెట్ మూడో స్థానంలో ఉంది. కమర్షియల్, ఫైనాన్సియల్ హబ్ గానూ చార్లెట్ ప్రసిద్ధికెక్కింది. ఇక్కడే బ్యాంక్ ఆఫ్ అమెరికా, ఈస్ట్ కోస్ట్, వచోవా లోవ్ లాంటి ప్రముఖ కంపెనీలున్నాయి. ఇక ఫుట్ బాల్ ఆటకు, ఆటో రేసింగ్, గోల్ఫ్ క్రీడకు ఈ నగరం ప్రసిద్ధి. ఇక్కడి బొటానికల్ గార్డెన్ కూడా పర్యాటకులను విశేషంగా ఆకర్శిస్తుంది. ఇంతటి ప్రాముఖ్యత ఉన్న చార్లెట్ నగరంలో తానా ఆధ్వర్యంలో నిర్వహించిన ధీం తానా కాంపిటీషన్స్ అట్టహాసంగా జరిగాయి. గుణ కొమ్మిరెడ్డి గారి చేతుల మీదుగా జ్యోతి ప్రజ్వలనతో తానా ధీంతానా కాంపిటీషన్స్ ప్రారంభమయ్యాయి. అతిథులను తానా ప్రతినిధులు ఘనంగా సన్మానించారు. అనంతరం సబ్ జూనియర్స్ క్లాసికల్ సింగింగ్, డాన్స్ విభాగంలో  నృత్య ప్రదర్శనలు స్పెషల్‌ అట్రాక్షన్‌గా నిలిచాయి. చిన్నారులు ఆలపించిన పాటలు ఆకట్టుకున్నాయి. ఈ విభాగానికి సత్య కడలి, హైమ పుల్లెల, భ్రమా పండ్రప్రగడలు జడ్జెస్ గా వ్యవహరించారు. క్లాసికల్ సబ్ జూనియర్ విభాగం అనంతరం జూనియర్స్ పోటీల్లోనూ పార్టిసిపెంట్స్ ప్రతిభను ప్రదర్శించారు. యామని పండ్రప్రగడ, శిరీష దమవాలం, కవిత రాజశేఖరం, దీపికా జల్లా జడ్జెస్ గా వ్యవహరించారు. పోటీల్లో విజేతలకు మెమోంటోస్ అందజేశారు.  
ధీంతానా కాంపిటీషన్స్ లో జూనియర్స్, సబ్ జూనియర్స్ మాత్రమే కాదు.. యువతీ యువకులు, మహిళలు కూడా తమ ప్రతిభకు పదును పెట్టారు. డాన్స్, సింగింగ్, ఫ్యాషన్ షో విభాగాల్లో తమ టాలెంట్ ను ప్రదర్శించారు. కార్యక్రమం ఆధ్యంతం కలర్ ఫుల్ గా సాగింది. జూనియర్, సబ్ జూనియర్స్ కేటగరీల్లో ఫోక్, క్లాసికల్, గ్రూప్ డాన్స్ పార్టిసిపెంట్స్‌ అదరగొట్టారు. విజేతలుగా నిలిచిన వారికి తానా సర్టిఫికెట్లతోపాటు మెమొంటోలను అందజేశారు. అనంతరం బ్యూటీ కాంటెస్ట్ లో భాగంగా ఫ్యాషన్ షో, మిస్ తానా, మిసెస్ తానా పోటీలు నిర్వహించారు. యువతులు, మహిళలు స్టేజ్ ఫై ఉత్సాహంగా ర్యాంప్ వాక్ చేశారు. చివరగా ఫ్యాషన్ షో, మిస్ తానా, మిసెస్ తానా కేటగిరీల్లో విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. చార్లెట్ నగరంలో జరిగిన పోటీల్లో గెలిచిన వారు మే 26 నుంచి సెయింట్ లూయిస్‌లో జరిగే తానా మహాసభల్లో పాల్గొంటారని జడ్జెస్ ప్రకటించారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com