అమెరికా ప్రభుత్వం...మరో కఠినమైన నిర్ణయం
- April 16, 2017
ఒకప్పటి రంగుల కళ... ఇక కలగా మారనుంది. ట్రంప్ సర్కారు తీసుకొస్తున్న ఒక్కో రూల్స్ అమెరికాలోని ప్రవాస భారతీయులకు వణుకుపుట్టిస్తున్నాయి. ఇప్పటికే ఇమ్మిగ్రేషన్ బ్యాన్, H1B వీసాలపై కఠిన నిబంధనలు, H4 వీసాలను తొలగించే ప్రయత్నం చేస్తున్న అమెరికా ప్రభుత్వం...మరో కఠినమైన నిర్ణయం తీసుకుంది. దేశంలో అక్రమంగా ఉంటున్నవారిని నిర్బంధించేందుకు ఆదేశాలు జారీచేది. అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు చేపట్టాక దేశంలోని ఎన్నారైల పరిస్థితి ఆందోళన కరంగా మారింది. అమెరికాకు పునర్ వైభవం తీసుకొస్తానంటూ ఎన్నికల్లో శపధం చేసిన ట్రంప్... దేశంలోకి అక్రమ వలసలను, అక్రమ వలసదారులను పనిపట్టేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. దీనిలో భాగంగా సరైన పత్రాలు లేకుండా అమెరికాలో నివసిస్తున్న వారిపట్ల కఠినంగా వ్యవహరించాలంటూ ప్రాసిక్యూటర్లకు, పోలీసు అధికారులకు, జడ్జీలకు అటార్ని జనరల్ జెఫ్ సెషన్స్ ఆదేశాలు జారీచేశారు. అక్రమ వలసదారులను గుర్తించడం, నిర్భంధించడం, తిరిగి వెనక్కి పంపించడం అనే నినాదంతో అమెరికా అధికారులు రంగం సిద్దం చేశారు. ఇన్నాళ్లు స్టేట్ మెంట్లు, ప్రకటనలకే పరిమితమైన ప్రభుత్వం ఇప్పుడు ఆదేశాలు జారిచేయడంతో అమెరికాలో అక్రమంగా నివసిస్తున్నవారికి కష్టాలు తప్పేలా లేవు..
అక్రమ వలసదారుల కారణంగా అమెరికన్ యువత ఉపాధి, ఉద్యోగాలు కోల్పోతుందన్న కారణంగా అధ్యక్షుడు ట్రంప్....అక్రమ వలసదారులను ఏలాగైనా దేశం నుంచి పంపించాలని భావిస్తున్నారు. ఎన్నికైన తర్వాత అదే లక్ష్యంతో చర్యలు చేపడుతున్నారు. దేశంలోకోటి మందికిపైగా అక్రమ వసలదారులు ఉండొచ్చని ఇమ్మిగ్రేషన్ అధికారులు భావిస్తున్నారు. అయితే అమెరికాలో భారత్, మెక్సికో, చైనా దేశాలకు చెందిన వారు అధిక సంఖ్యలో వలసవెళ్లి నివసిస్తున్నారు. వీరిలో మెక్సికన్లే ఎక్కువ. దాదాపు 5లక్షలమంది ప్రవాస భారతీయులు అమెరికాలో అక్రమంగా ఉంటున్నట్లు తెలుస్తోంది. వీరంతా టూరిస్టు, స్టూడెంట్స్, తాత్కాలిక వీసాలపై వెళ్లినవారే. అమెరికా ప్రభుత్వం తాజాగా జారీచేసిన ఆదేశాలు సిలీకాన్ వ్యాలీ లోని భారతీయ సాప్ట్ వేర్ ఉద్యోగులు, వలసదారులే లక్ష్యంగా చేసుకొని తనిఖీలు నిర్వహించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఇమ్మిగ్రేషన్ అధికారులు రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. అయితే ట్రంస్ సర్కారు ఇచ్చిన ఆదేశాలను అమలు చేయడం అంత సులభమేమి కాదని ఇమ్మిగ్రేషన్ అధికారులు అంటున్నారు. దౌత్యపరమైన సమస్యలు వచ్చే అవకాశం లేకపోలేదని వారు అభిప్రాయపడుతున్నారు.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







