పెళ్లి చేసుకున్నకొద్ది రోజులకే సౌదీ చెక్కేసిన భర్త
- April 16, 2017
పెద్దల సమక్షంలో నిఖా చేసుకున్నాడు. ఇరవై రోజులు భార్యతో సంసారం చేశాడు. ఆ తర్వాత చెప్పాపెట్టకుండా సౌదీకి చెక్కేశాడు. భర్త సౌదీ వెళ్లిన విషయం తెలిసిన భార్య.. పరేషాన్ అయ్యింది. ఫోన్లో మాట్లాడేందుకు ప్రయత్నిస్తే ఖామూష్ అంటూ వార్నింగ్ ఇచ్చాడు. ఇప్పటి వరకు జరిగిన పెళ్లి గిల్లీ జాన్తానై అన్నాడు. డైవర్స్ ఇస్తే ఇంకో సెటప్ సెట్ చేసుకుంటానని చెప్పడంతో ఆ ఇల్లాలు తల్లడిల్లింది. తనకు భర్తే కావాలని మహిళా సంఘాల సహకారంతో అతని ఇంటిముందు నిరసన దీక్షకు దిగింది. వివరాల్లోకి వెళ్తే...
వరంగల్ ఇస్లాంపురాకు చెందిన ఇక్రమొద్దీన్.. అదే ప్రాంతానికి చెందిన జుబేదా పర్వీన్ ను గతేడాది సెప్టెంబర్ 26న పెళ్లి చేసుకున్నాడు. పెళ్లప్పుడు కట్నకానులు భారీగానే ముట్టజెప్పారు. 20రోజులపాటు బాగానే ఉన్నాడు. ఏమొందో ఏమో గతేడాది అక్టోబర్ 19న భార్యకు చెప్పకుండా సౌదీకి వెళ్లిపోయాడు. భర్త సౌదీ వెళ్లిన విషయం తెలిసి..పర్వీన్ షాకయ్యింది. కులపెద్దలను పిలిపించి అత్తింటివారిని ఆరా తీయగా.. తమకేమి తెలియదని బుకాయించారు. ఆ తర్వాత అత్తమామలు కూడా రాత్రికిరాత్రే ఇంటికి తాళమేసుకుని పత్తాలేకుండా పోయారు. అసలు ఏం జరిగిందో తెలుసుకునేందుకు పర్వీన్ ఎన్నోసార్లు ఫోన్లో ట్రై చేసింది. కానీ.. ఇక్రమొద్దీన్ మాత్రం మాట్లాడేవాడు కాదు. తనను మర్చిపోవాలని.. నీతో అవసరం తీరిపోయిందని మెస్సేజులు పెట్టేవాడు. మోడలింగ్ అమ్మాయిని చూసుకున్నానని.. నీకు తలాక్ ఇచ్చి ఆమెను పెళ్లి చేసుకుంటానని చెప్పాడు. ఆరు నెలల నుంచి ఇలాంటి సమాధానం రావడంతో విసిగిపోయిన పర్వీన్..భర్త ఇంటి ముందు న్యాయ పోరాటం చేస్తోంది. 20రోజులు తనతో కాపురం చేసి వెళ్లిపోవడంతో పర్వీన్ న్యాయం పోరాటం చేస్తోంది. ఫోన్ చేస్తే తలాక్ చెబుతానని బెదిరిస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేస్తోంది. తన భర్త తనకు కావాలని.. అతని కోసం వెయ్యి కళ్లతో ఎదురుచూస్తోంది. 20రోజులు కాపురం చేశాక.. ఇప్పుడు డైవర్స్ ఇస్తాననడం ఎంతవరకు న్యాయమని ప్రశ్నిస్తోంది.
తాజా వార్తలు
- యుద్ధ ప్రభావం నుంచి కోలుకుంటున్న బహ్రెయిన్ దిగుమతులు..!!
- ఫాదర్ అమీర్ షేక్ హమద్ మృతిపై ప్రపంచ దేశాల సంతాపం..!!
- ఒమన్ ఆహార భద్రతకు కీలకంగా అల్ ధాహిరా పురోగతి..!!
- హోర్ముజ్ జలసంధి భద్రతపై సౌదీ విదేశాంగ మంత్రి చర్చలు..!!
- బార్డర్ పోస్టులు, సముద్ర చమురు ప్లాట్‌ఫామ్‌కు నష్టం: కువైట్
- వేసవి సెలవుల్లో ట్రాఫిక్‌కు బ్రేక్.. ఏడాది పొడవునా సాధ్యమేనా?
- బహ్రెయిన్‌లో సైరన్లు మోగింపు.. సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని ప్రజలకు సూచన
- కువైట్ గగనతలంలోకి చొరబడిన శత్రు వైమానిక వస్తువులను కూల్చివేసిన వైమానిక రక్షణ వ్యవస్థ
- లూసైల్ స్టేడియం రోడ్డులో ట్రాఫిక్ ఆంక్షలు..!!
- కువైట్‌లో నాలుగు రోజుల పాటు అధికారిక సంతాప దినాలు..!!







