మే 5న విడుదల కానున్న "బాబు బాగా బిజి "
- April 16, 2017
మంచి చిత్రాలతో ప్రేక్షకుల్ని అలరించటమే ధ్యేయంగా శ్రీ అభిషేక్ పిక్చర్స్ అధినేత అభిషేక్ నామా. దర్శక నటుడు అవసరాల శ్రీనివాస్ హీరోగా వినూత్న కథతో నిర్మించిన చిత్రం బాబు బాగా బిజీ. బాలీవుడ్ హిట్ చిత్రం హంటర్ కి తెలుగు రీమేక్ ఇది. నవీన్ మేడారం దర్శకుడిగా పరిచయమౌతున్న ఈ చిత్రంలో మిస్తీ చక్రవర్తి, తేజస్వి మదివాడ, సుప్రియ ఐసోల, శ్రీ ముఖి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంబందించిన సెన్సారు కార్యక్రమాలు పూర్తిచేసుకుని A సర్టిఫికేట్ పొందింది. మే 5న ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక థియేటర్లలో గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నట్లు నిర్మాత ప్రకటించారు.
ఈ సందర్భంగా నిర్మాత అభిషేక్ నామా మాట్లాడుతూ. అవసరాల శ్రీనివాస్ చేసిన అన్ని చిత్రాలకంటే బాబు బాగా బిజి చిత్రం రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కించాము. ఈ చిత్రం ద్వారా నవీన్ మేడారం దర్శకుడుగా పరిచయం అవుతున్నాడు. చాలా బాగా తెరకెక్కించాడు. సినిమా ప్రారంభం నుంచి చివరి వరకు నవ్వించే చిత్రమిది. అన్ని వర్గాల్ని తప్పకుండా ఎంటర్ టైన్ చేసే చిత్రమిది. మిస్తీ చక్రవర్తి, తేజస్వి మదివాడ, సుప్రియ ఐసోల, శ్రీ ముఖి ఇందులో విభిన్నమైన పాత్రల్లో ప్రేక్షకుల్ని ముఖ్యంగా యూత్ ని ఎంటర్టైన్ చేస్తారు. సునీల్ కశ్యప్ స్వరపరిచిన పాటలు ఇప్పటికే మార్కెట్ లో విడుదలై, చాలా మంచి రెస్పాన్స్ వస్తున్నాయి. ఇవన్నీ చిత్రంలో సందర్భానుసారంగా వచ్చే పాటలు. సెన్సారు కార్యక్రమాలు పూర్తిచేసుకుని సభ్యులచే ప్రశంసలు అందుకుంది. A సర్టిఫికేట్ తో చిత్రం మే 5న పెర్ఫెక్ట్ సమ్మర్ ఎంటర్టైనర్గా ప్రేక్షకుల ముందుకు రానుంది.. అని అన్నారు.
అవసరాల శ్రీనివాస్, మిస్తీ చక్రవర్తి, తేజస్వి మదివాడ, సుప్రియ ఐసోల, శ్రీ ముఖి, తనికెళ్ల భరణి, పోసాని కృష్ణమురళి, అన్నపూర్ణమ్మ, పెళ్లి చూపులు ఫేం ప్రియదర్శి, రవి ప్రకాష్, తదితరులు నటిస్తున్నారు.
సాంకేతిక నిపుణులు
ఎడిటర్ - ఎస్.బి. ఉద్దవ్,
మాటలు - మిర్చి కిరణ్, శ్రీకాంత్ రెడ్డి, ప్రదీప్ బోద
ఛాయాగ్రహణం - సురేష్ భార్గవ
సంగీతం - సునీల్ కశ్యప్,
నిర్మాత - అభిషేక్ నామా
స్క్రీన్ ప్లే, దర్శకత్వం - నవీన్ మేడారం
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







