హంసల దీవిలో కొత్త షెడ్యూల్ ప్రారంభించనున్న బోయపాటి
- April 16, 2017
సెన్సేషనల్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో యువ కథానాయకుడు బెల్లంకొండ సాయిశ్రీనివాస్ హీరోగా ద్వారకా క్రియేషన్స్ పతాకంపై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్న చిత్రంలో బెల్లంకొండ శ్రీనివాస్ సరసన రకుల్ ప్రీత్ సింగ్, ప్రగ్యా జైస్వాల్ లు కథానాయికలుగా నటిస్తున్న విషయం తెలిసిందే. నేటి నుంచి ఈ చిత్రం డబ్బింగ్ కార్యక్రమాలు మొదలయ్యాయ్, ఏప్రిల్ 21 నుంచి సరికొత్త షెడ్యూల్ ను హంసల దీవిలో ప్రారంభించనున్నారు.
ఈ సందర్భంగా చిత్ర నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి మాట్లాడుతూ.. "నిన్నటితో హైద్రాబాద్ షెడ్యూల్ పూర్తయ్యింది. ఏప్రిల్ 21 నుంచి హంసల దీవిలో రామ్-లక్ష్మణ్ ల నేతృత్వంలో ఓ పోరాట సన్నివేశాన్ని చిత్రీకరించనున్నాం. డబ్బింగ్ కార్యక్రమాలు కూడా నేటి నుంచి మొదలయ్యాయ్. బెల్లంకొండకు మాస్ హీరో ఇమేజ్ ను తీసుకురావడంతోపాటు స్టార్ హీరోగా నిలబెట్టేందుకు బోయపాటి ఆహారహం శ్రమిస్తున్నారు" అన్నారు.
జగపతిబాబు, వాణి విశ్వనాథ్, ఎస్తేర్, సితార, సుమన్, నందు, శశాంక్ తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి మాటలు: ఎం.రత్నం, సంగీతం: దేవిశ్రీప్రసాద్, సినిమాటోగ్రఫీ: రిషి పంజాబీ, కళ: సాహి సురేష్, కూర్పు: కోటగిరి వెంకటేశ్వర్రావు, స్టిల్స్: జీవన్, పోస్టర్ డిజైన్స్: ధని ఏలె, ప్రెస్ రిలేషన్స్: వంశీ-శేఖర్, పోరాటాలు: రామ్ లక్ష్మణ్, నిర్మాణం: ద్వారకా క్రియేషన్స్, నిర్మాత: మిర్యాల రవీందర్ రెడ్డి, కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: బోయపాటి శ్రీను!
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







